Read more!

English | Telugu

నా పెళ్ళికి మా నాన్న లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాధ

"నీతోనే డాన్స్" షో ఈవారం ఎపిసోడ్ చాలా బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ కి ఫాదర్స్ డే రావడంతో జడ్జెస్ అంతా వాళ్ళ వాళ్ళ నాన్నల గురించి చెప్పుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. రాధ స్టేజి మీద కన్నీళ్లు పెట్టేసుకున్నారు. "మా అంబికా అక్క, మల్లికా అక్క ఇద్దరూ చాలా ఫెయిర్ గా ఉంటారు. మా నాయనమ్మకు కోపం వచ్చినప్పుడల్లా అసలు నువ్వు ఎందుకు నల్లగా పుట్టావో తెలుసా అని అనేది. వాళ్ళ అంత కళగా లేవు ఎందుకో తెలుసా అంటూ ఉండేది. ఎందుకంటే మా నాన్న బాగా నలుపుగా ఉండేవారు. మళ్ళీ నన్ను సముదాయించడానికి నువ్వు నీ చిన్న తమ్ముడే గ్యారెంటీ..వీళ్ళు ఎక్కడైనా మారిపోతారనే డౌట్ అనేవాళ్ళు.  నీకు గజ కేసరి యోగం ఉంది తెలుసా నువ్వు పెద్దయ్యాక పెద్ద ఏనుగును కొనుక్కుంటావు అని చెప్పి నా ఫామిలీ మొత్తం ఇంటి ముందు ఒక ఏనుగును పెట్టారు..నా పెళ్ళికి కూడా మా నాన్న లేరు.

మా పెద్దనాన్న ఉన్నారు. నాన్నా హ్యాపీ ఫాదర్స్ డే" అని చెప్తూ ఏడ్చేశారు అందాల నటి రాధ. "మా నాన్న హీరాలాల్ మాష్టర్. హిందీలో గైడ్ , తేరే మేరె సప్నే, మేరా నామ్ జోకర్ , ఇలాంటి ఎన్నో తెలుగు, హిందీ, తమిళ్ ఫిలిమ్స్ చేశారు. నాకు భరతనాట్యం నేర్పించారు. నన్ను ఒక కొరియోగ్రాఫర్ గా చేసి..నాకు ఒక మంచి దారిని వేసి ఆయన వెళ్లిపోయారు. ఈరోజు నేను ఏంటో అదంతా మా నాన్న నాకు నేర్పిందే" అన్నారు తరుణ్ మాస్టర్. "మా నాన్న చాలా హ్యాపీగా ఉండేవారు. అతని మనసు ఎప్పుడూ యంగ్ గా ఉండేది. ఈరోజు నేను అలాగే మనసుని యంగ్ గా ఉంచుకోవడానికి కారణం మా నాన్నే. అందుకే నేను ఏం కావాలి అనుకున్నానో అదే అయ్యాను" అని చెప్పారు సదా. ఇలా సదా, రాధ, తరుణ్ మాష్టర్ ముగ్గురూ కూడా వాళ్ళ నాన్నలను తలుచుకున్నారు.