English | Telugu

దీపికా పిల్లి ఏంటమ్మా ఇది ? పోలీసులు చూస్తున్నారా ?

ప్రయోగాలు చేయొచ్చు కానీ మరీ దారుణంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం వలన ఎం ఉపయోగం..ఇంతకు ఏంటి ఆ ప్రయోగాలు అనుకుంటున్నారా. దీపికా పిల్లి బుల్లితెర మీద సందడి చేసిన అమ్మడు ఇప్పుడు కార్ తో ప్రయోగాలు మొదలు పెట్టింది. సోషల్‌ మీడియా స్టార్‌గా, టిక్ టాక్ వీడియోస్ తో అభిమానులను సంపాదించుకొని యాంకర్ గా అవకాశం అందిపుచ్చుకుని నటిగా ఎదిగింది దీపికా పిల్లి. ఇప్పుడు దీపికా సోలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలోనూ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

అలాంటి దీపికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది కార్ డ్రైవింగ్ వీడియో...ఐతే కార్ ఏమీ దీపికా పిల్లి నడపట్లేదు. కార్ ని స్లో మోషన్ లో ఉంచేసి దీపికా బయటకు వచ్చేసి కార్ అలా వెళ్తుంటే ఈమె ఆ కార్ పక్కన డాన్స్ లు వేస్తూ కనిపించింది. అందులో టేక్ 1 , 2 , 3 అంటూ కూడా పెట్టింది. ఐతే నెటిజన్స్ మాత్రం దీపికను బాగా తిడుతున్నారు. "పోలీసులు మీరంతా ఎక్కడున్నారు. ఇది చూస్తున్నారా ? అరెస్ట్ చేయండి అర్జెంట్ గా , మీ భద్రతా కోసమే చెప్తున్నాం..ఇక నుంచి ఇలాంటి రీల్స్ చేయకండి...పోలీసులు కేసు కట్టండి. తింగరి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే దీపికా , యాంకర్ ప్రదీప్ నటించిన అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి మూవీ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఈ సినిమాతో యాంకర్ ప్రదీప్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.