Read more!

English | Telugu

 స్టైలిష్ లుక్ లో లాస్యప్రియతో కలిసి పాట పాడిన చిత్ర

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రతీ వారం కంటెస్టెంట్స్ మధ్యన  పోటాపోటీగా పాటల సంగ్రామం జరుగుతోంది. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో లాస్య ప్రియా ఎలిమినేషన్ నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ లేటెస్ట్ ప్రోమోలో లాస్యప్రియను స్పెషల్ గా హైలైట్ చేశారు. "జల్లంత కవ్వింత కావాలిలే" అంటూ ఆమె సాంగ్ పాడి మెస్మోరిజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. "నీ ఈ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది" అన్నాడు జడ్జి కార్తిక్. ఇక ఈ షోకి చిత్ర, ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి, శ్రియ వచ్చారు.

వాళ్ళు కూడా లాస్య పెర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. "లాస్య మంచి  ఆటిట్యూడ్ తో చాలా బాగా పాడావ్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు చిత్ర. ఆ ప్రశంసకు ఫిదా ఐపోయిన లాస్య కూడా ఆమెను ఒక కోరిక కోరింది. "మీరు ఒప్పుకుంటే మీతో కలిసి పాడాలని ఉంది" అని తన మనసులో కోరికను బయటపెట్టింది. ఇక చిత్ర, లాస్య ఇద్దరూ నల్ల కళ్లద్దాలు పెట్టుకుని మంచి స్టైలిష్ లుక్ తో "అటు చూడొద్దన్నానా..మాటాడొద్దన్నానా" అనే సాంగ్ పాడారు. దాంతో స్టేజి మీద కంటెస్టెంట్స్ అంతా లేచి క్లాప్స్ కొట్టారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ వరద కురిపిస్తున్నారు. "చిత్రమ్మని తెలుగు ఐడల్ లో చూడాలన్న కోరిక తీరింది..ఇదొక లవ్లీ ఎపిసోడ్ కాబోతోంది... వావ్ బొమ్మ బ్లాక్ బస్టర్.. చిత్రమా స్టైల్ అదుర్స్...లాస్యప్రియ చాలా లక్కీ..చిత్రమా లివింగ్ లెజెండ్..ఈ ఎపిసోడ్ కోసం వెయిటింగ్" అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ మే 12 , 13 న ఆహా ఓటిటి వేదిక మీద స్ట్రీమ్ కాబోతోంది. మరి ఈ రాబోయే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు..ఎవరు సేఫ్ జోన్ లో నిలుస్తారో చూడాలి.