Read more!

English | Telugu

బ్రహ్మముడి అపర్ణ పెళ్ళిరోజుని సెలబ్రేట్ చేసిన వైదేహి పరిణయం సీరియల్ టీం!

శ్రీప్రియ అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ బ్రహ్మముడి అపర్ణ దేవి అంటే అందరికి పరిచయమే. బ్రహ్మముడి సీరియల్ లో కొడుకు అంటే ఎంత ప్రేమో చూపిస్తూనే.. కోడలు మోసం చేసి పెళ్ళిచేసుకుందని ద్వేషాన్ని చూపిస్తున్న అపర్ణ పాత్రలో శ్రీప్రియ ఆకట్టుకుంటుంది. కొడుకంటే ప్రేమ గల తల్లిగా కోడలికి బాధ్యతలు అప్పగించడానికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతీ ఇంట్లో ఉండే అత్తగా ఒక హోదాలో కనిపించే శ్రీప్రియ గురించి మనకు తెలియని విషయాలే చాలానే ఉన్నాయి.

శ్రీప్రియ బుల్లితెరకి పరిచయమై దాదాపు పదిహేను సంవత్సరాలు దాటింది. మొగలిరేకులు సీరియల్ లో అమ్మ పాత్రతో కెరీర్ ప్రారంభించిన శ్రీప్రియ దాదాపు అన్ని సీరియల్స్ లో అమ్మ పాత్రనే చేస్తూ వస్తుంది. కొన్ని సీరియల్స్ లో  వదినగా, అత్తగా చేసింది. ఇలా బుల్లితెరపై ఒక తల్లిగా, అత్తగా, వదినగా చేస్తూ తన నటనతో అందరిని మెప్పిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తుంది శ్రీప్రియ. తెలుగు సీరియల్స్ లో ఉన్న దాదాపు అందరు హీరోలకి, హీరోయిన్ లకి అమ్మ పాత్ర పోషించానని ఎంతో సంతోషంగా చెబుతుంటుంది శ్రీప్రియ.

'మొగలి రేకులు' సీరియల్ తర్వాత మళ్ళీ 'వైదేహీ పరిణయం' సీరియల్ తో ఫేమ్ లోకి వచ్చిన శ్రీప్రియ.. తన ప్రస్థానంలో ఎన్నో సీరియల్స్ లో తల్లి పాత్రను చేసింది. కానీ నిజ జీవితంలో తనకి కొడుకు లేడని బాధపడుతుంది. అయితే బ్రహ్మముడి సీరియల్ లో తను రాజ్ కి అమ్మగా నటిస్తుంది. దీంతో కావ్యకి అత్త అయ్యి.. తనని ద్వేషించడంతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది.  అయితే మే 10 తన వివాహ దినోత్సవం కావడంతో ఆ సీరియల్ లో నటీనటులు.. వైదేహీ పరిణయం సీరియల్ నటులు, ఇంకా తన స్నేహితులు కలిసి వారి పెళ్ళిరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. షూటింగ్ స్పాట్ లోనే కేక్ కట్ చేపించి వారి పెళ్ళిరోజుని మరింత ఆనందంగా చేసారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నింటిని కలిపి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది శ్రీప్రియ. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.