Read more!

English | Telugu

అమ్మపై చందమామ ఫైర్.. నెట్టింట వైరల్ గా మారిన క్యూట్ వీడియో!

మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో నాన్న మీద కూతురు చూపించే ఎమోషన్స్ ప్రేమ, కోపం అన్నింటిని చూస్తాం. అయితే అందులో కొన్ని క్యూట్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి‌. అలా చందమామ అనే చిన్న పాప వాళ్ళ అమ్మ మీద కోప్పడిన ఓ వీడియో నెట్టింట ది బెస్ట్ ఆండ్ క్యూట్ వీడియో లిస్ట్ లోకి చేరింది. మరి ఆ వీడియో ఏంటో ఓసారి చూసేద్దాం.

అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్‌ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్. అంజలి పవన్ వాళ్ళ పాప పేరు 'ఆద్య' ముద్దుపేరు చందమామ. ఇక అంజలి పవన్ తన యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. 'వర్షం వల్ల చందమామ 3rd బర్త్ డే' అనే వ్లాగ్ మోస్ట్ పాపులర్ వీడియోగా మారింది‌. ఇక ఇన్ స్టాగ్రామ్ లో చందమామ లంగావోణీ కాస్ట్యూమ్ లో శ్రీసత్యతో కలిసి చేసిన ఓ రీల్ మిలియన్ వ్యూస్ మార్కుని దాటింది. 

ఇక సండే రోజు ఇంట్లో అంజలి తన కూతురితో సరదాగా ఓ రీల్ చేసింది. అందులో చందమామ ఫైటింగ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అసలు చందమామ ఏం అందంటే... ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి డబ్బులు ఉంటాయి. డైపర్లు ఆర్డర్ పెట్టడానికి డబ్బులు లేవా అని చందమామ కోప్పడేసరికి అంజలి షాక్ అవుతుంది. ఏమ్మా నా దగ్గర లేవని అడుగగా.. డైపర్లు ఆర్డర్ పెట్టే ఫస్ట్ అంటు చందమామ కోపంగా చెప్పే బుజ్జి బుజ్జి మాటలు భళే ముద్దుగా ఉన్నాయి. ఇదంతా అంజలి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు క్యూట్ వీడియో ఆన్ ఇంటర్నెట్ అంటు స్పందిస్తున్నారు. మరి నేడు ఇన్ స్టాగ్రామ్ లో మీరు చూసిన క్యూట్ వీడియో ఏంటో కామెంట్ చేయండి. చందమామ చేసిన ఈ మినీ రిల్ మీరు చూసారా? చూడకుంటే ఓసారి అంజలితోట ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళి చూసేయ్యండి.