Read more!

English | Telugu

టీఆర్పీలో బ్రహ్మముడి సీరియల్ ని బీట్ చేసిన కార్తీకదీపం-2!

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో స్టార్ మా టీవీలోని సీరియల్స్ టాప్-5 లో ఉన్నాయి. అయితే కొత్తగా నవవసంతంగా వచ్చిన కార్తీకదీపం-2 మొదలై మూడు వారాలు కూడా పూర్తికాకుండానే అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. నిన్న మొన్నటిదాకా మొదటి స్థానంలో ఉన్న బ్రహ్మముడిని కార్తీకదీపం-2 స్వల్ప పాయింట్ల తేడాతో బీట్ చేసింది.

రేటింగ్ ప్రకారం.. మొట్టమొదటి స్థానంలో ' కార్తీకదీపం-2' సీరియల్ ఉండగా.. రెండవ స్థానంలో ' బ్రహ్మముడి', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి', నాల్గవ స్థానంలో ' నాగపంచమి', అయిదవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ నాల్గవ స్థానంలో ఉండగా.. మీరాగా ముకుంద కొత్త అవతారం ఎత్తడంతో కథ ఇంట్రెస్ట్ గా సాగుతోంది. కృష్ణ , మురారీల లవ్ ట్రాక్ బాగుండటం, వారిద్దరి శోభనానికి మీరా అలియాస్ ముకుంద ఎలా అడ్డుకట్ట వేయనుంది అనే  క్యూరియాసిటి ప్రేక్షకులలో కలవడంతో ఇది నాల్గవ స్థానం నుండి మూడవ స్థానానికి చేరింది. అయితే నిన్న మొన్నటివరకు మొదటి స్థానంలో  ఉన్న బ్రహ్మముడి రెండవ స్థానానిని పడిపోయింది. ఇక మొదటి స్థానంలో కార్తీకదీపం-2 వచ్చేసింది. వంటలక్క డాక్టర్ బాబు ల ఫ్యాన్స్ ఈ సీరియల్ ని మళ్లీ చూసేస్తున్నారన్నమాట. అయితే గుప్పెడంత మనసు సీరియల్ తో బ్రహ్మముడి సీరియల్ పోటీపడుతోంది.

దీప, శౌర్య ఇద్దరు కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావడంతో కథ ఆసక్తిగా మారింది. అయితే నరసింహా తన భార్య కోసం వెతడకం మొదలెట్టాడు. మరీ కార్తిక్, దీపలు కలిసే ఉండగలరా? దీపని జ్యోత్స్న ఇప్పటిదాకా పాజిటివ్ గా చూస్తోంది. మరి కార్తిక్, దీపలు ఎప్పుడు కలుస్తారనే క్యూరియాసిటిని పెంచేస్తూ ఈ సీరియల్ టీఆర్పీలో మొదటి స్థానానికి చేరుకుంది.