Read more!

English | Telugu

డైరెక్టర్ కాబోతున్న బుల్లెట్ భాస్కర్!

శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్స్ మాత్రం కాదు అప్పుడప్పుడు కొన్ని సీక్రెట్స్ కూడా బయట పడుతూ ఉంటాయి. ఈ వారం షో మంచి రసవత్తరంగా సాగింది.  సమ్మర్ లో వాటర్ ట్యాంక్ దగ్గర గొడవలు..వాటర్ ట్యాంక్ టైంకి రాకపోతే లేడీస్ ఎలా విసుక్కుంటారో స్కిట్స్ చేసి చూపించారు. ఇక ఈ షోకి  "నరకాసుర" మూవీ టీం ప్రొమోషన్స్ లో భాగంగా రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, అపర్ణ జనార్దన్ వచ్చారు. "నరకాసుర అంటున్నారు..మరి ఇద్దరమ్మాయిలను తీసుకొచ్చారేమిటి" అని హీరోని ఆది అడిగేసరికి "ఒక అమ్మాయి నా మరదలు నన్ను ఇష్టపడింది..ఇంకో అమ్మాయి నా మేనేజర్ నేను ఇష్టపడ్డాను" అని రక్షిత్ చెప్పేసరికి "ఓహ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీనా" అంది. "పలాస చూసారు మీరంతా అందులో రక్షిత్ హీరో కదా అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు...ఈ సినిమా కూడా అంతే బిగ్ హిట్ అవుతుంది..ఇక్కడ  ఇంకో సీక్రెట్ ఏంటో తెలుసా..రక్షిత్ హీరోగా..బులెట్ భాస్కర్ డైరెక్టర్ గా నెక్స్ట్ ఇంకో మూవీ రాబోతోంది." అని చెప్పేసరికి అందరూ వావ్ అన్నారు.

ఇక ఈ మూవీ గురించి హీరోయిన్స్ మాట్లాడుతూ "ఇందులో యాక్షన్, డ్రామా, ఫామిలీ ప్యాకేజ్ ఇది" అని చెప్పారు. "ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని..మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా" అని విష్ చేశారు ఇంద్రజ. బుల్లితెర మీద నుంచి ఎంతో మంది కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెటిల్ అవుతున్నారు. అలాంటి ఒక కమెడియన్ సుధీర్ హీరో అయ్యాడు, లేడీ కమెడియన్ రోహిణి సేవ్ ది టైగర్స్ లో కామెడీ రోల్ చేసి మంచి మార్క్స్ కొట్టేసింది. వేణు బలగం మూవీని డైరెక్ట్ చేసి మంచి కలెక్షన్స్ అందుకున్నాడు. ఇప్పుడు బులెట్ భాస్కర్ వంతొచ్చినట్టు ఉంది. మరి ఏ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు...స్టోరీ ఏమిటి అనే వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.