Read more!

English | Telugu

కృష్ణ ముకుంద మురారిలోని సిద్ధు.. గుప్పెడంత మనసులో సారథిగా ఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిన్న మొన్నటి దాకా శైలేంద్ర విలనిజం, దేవయాని కన్నింగ్ థాట్స్ తో సాగుతున్న గుప్పెడంత మనసు.. ఇప్పుడు మరొక కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో అత్యధిక వీక్షకాదరణకు కారణం అవుతుంది.

గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ చేంజ్ చేసిన తర్వాత కూడా దీని టీఆర్పీలో ఏ మార్పు రాలేదు.. అత్యధిక వీక్షకాదరణతో టాప్-5 లో నిలిచింది గుప్పెడంత మనసు. అయితే శైలేంద్ర, దేవయానిల గుట్టు జగతి, వసుధారలకి తెలిసినా ఏం చేయలేకపోతున్నారు. కొత్తగా శైలేంద్ర మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. సారథి అనే కొత్త క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరిగింది. దీంతో ఈ సీరియల్ పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతోంది. సారథి తనకి బాగా నమ్మకస్తుడని చెప్పిన శైలేంద్ర.. రిషి కడుతున్న మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్ తనకి ఇచ్చేలా చేసాడు. అదంతా చూస్తూ ఏం చేయలేకపోయిన వసుధార.. వాళ్ళంతా వెళ్ళిపోయాక జగతితో మాట్లాడుతుంది. మనం ఇలానే ఉంటే శైలేంద్ర ఇంకా ఎన్ని గోరాలు చేస్తాడో మేడం ఏదో ఒకటి చేసి రిషి సర్ కి చెప్పాలని అతని దగ్గరికి ఇద్దరు వెళ్తుండగా.. రిషిని చంపాలని కాలేజ్ బిల్డింగ్ మీద నుండి పూలకుండిని అతని మీద పడేలా చేస్తాడు శైలేంద్ర.. అయితే వసుధార చూసి రిషిని పక్కకి లాగడంతో జస్ట్ లో మిస్ అవుతుంది.

సారథి ఇంతకముందు కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నందు ప్రేమించిన వ్యక్తి గౌతమ్(సిద్దు) గా పరిచయం అవుతాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నందు, గౌతమ్ ల పెళ్ళి కృష్ణ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ గౌతమ్ ఈ సీరియల్ కి రావడంతో రెండు సీరియల్స్ ని ఫాలో అయ్యేవాళ్ళకి పండగనే చెప్పాలి. ఒకే ఆర్టిస్ట్ రెండు ఫేవరెట్ సీరియల్స్ లో వస్తుండటంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ లో రిలీజైన ప్రోమోలకి ప్రేక్షకులు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.