Read more!

English | Telugu

నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో శ్రీకర్ కృష్ణ ?

సీరియల్ యాక్టర్ శ్రీకర్ కృష్ణ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ స్టార్ మాలో ప్రసారమవుతున్న "బ్రహ్మముడి" సీరియల్ లో రాహుల్ అంటే అందరికీ తెలిసిపోతుంది. శ్రీకర్  యాంకర్ గా, మెజీషియన్ గా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. అలాంటి శ్రీకర్ కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేసాడు. తన ఫాన్స్ ని క్వశ్చన్స్ అడగమని చెప్పాడు. "బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో మేమంతా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం" అని ఒక ఫ్యాన్ అడిగేసరికి "చూద్దాం ఎలా జరుగుతుందో" అని ఆన్సర్ ఇచ్చాడు. "బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ క్యారెక్టర్ చాలా బాగుంది..నేను మీకు పెద్ద ఫ్యాన్" అనేసరికి "థ్యాంక్యూ" అని చెప్పాడు.

"బ్రహ్మముడిలో రాహుల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపిస్తుంది" అనేసరికి "నాకు చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది" అని అన్నాడు. "మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉన్నారు" అనేసరికి శ్రీకర్ సిగ్గుపడుతూ "ఛ ఊరుకోండి" అని రిప్లై ఇచ్చాడు. "మీ మ్యారేజ్ ఎప్పుడు" అని కొంటెగా ఒక ఫ్యాన్ అడిగేసరికి "అప్పుడే పెళ్లేమిటండి..అంత వయసు ఇంకా రాలేదు" అని చెప్పాడు. "రియల్లీ సారీ. మీ ఫ్యాన్ పేజీ ఓపెన్ చేశా..కానీ స్కూల్స్ తీసేసరికి నేను హాస్టల్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది" అని యంగ్ ఫ్యాన్ చెప్పేసరికి "చదువుకోండి ముంది..మిగతావి తర్వాత" అని స్వీట్ వార్నింగ్ ఇచ్చేసాడు. ఇలా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్పాడు. శ్రీకర్ కృష్ణ 2019లో, స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా  కెరీర్‌ స్టార్ట్ చేసాడు.  2021లో 'నరసింహపురం' అనే మూవీతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు..ఆ తర్వాత  'కళ్యాణ వైభోగం' సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టాడు. ఆ తర్వాత శతమానం భవతిలో నటించాడు ఇప్పుడు బ్రహ్మముడిలో రాహుల్ గా నటిస్తున్నాడు. సోషల్ మీడియాలో క్యూట్ ఫోటో షూట్స్ ని అప్ లోడ్ చేస్తూ అప్పుడప్పుడు మ్యాజిక్ చేసే వీడియోస్ పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు శ్రీకర్.