Read more!

English | Telugu

భాషతో సంబంధం లేదు...నాకు నటన అంటే ఇష్టం.

తేజస్విని గౌడ మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత  నటిగా మారింది.  "కోయిలమ్మ" సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తోంది. తేజస్విని గౌడ సీరియల్ నటుడు అమరదీప్ ని వివాహం చేసుకుంది. ఈమె సీరియల్స్ లో నటిస్తోంది అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. "హాయ్ వదిన...అమర్ అన్న ఎలా ఉన్నాడు, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది" అని అడిగేసరికి "మేము చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నాం అని చెప్తూ ఒక ఫోటోని పోస్ట్ చేసింది" తేజు. "విష్ణు అక్క గురించి ఒక మాటలో చెప్పు" అనేసరికి " సోల్ సిస్టర్" అని చెప్పింది. "మీరు అమర్ అన్న కలిసి ఒక లవ్ వెబ్ సిరీస్ చేయొచ్చు కదా" అని అడిగేసరికి "ఏమో చూద్దాం" అని చెప్పింది.

"తెలుగులో మీరు చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ చెప్తారా" అని అడిగిన ఫ్యాన్ "త్వరలో అప్ డేట్ చేస్తాను " అని రిప్లై ఇచ్చింది. "సిద్దు గురించి ఒక మాటలో చెప్పాలంటే" అని అడిగేసరికి "మరో తల్లికి పుట్టిన నా అన్నయ్య" అని చెప్పింది. "తెలుగు అండ్ తమిళ్ లో సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కదా..ఈ రెండిటిలో ఏది ఇష్టం" అన్న ప్రశ్నకు "నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఆ లాంగ్వేజ్ ఆ ఈ లాంగ్వేజ్ ఆ అని కాదు" అంది. ఇక అమరదీప్, తేజస్విని గౌడ ఇద్దరూ సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అమరదీప్ ప్రస్తుతం `జానకి కలగనలేదు` అనే సీరియల్‌లో నటిస్తున్నాడు. కన్నడకి చెందిన తేజస్విని గౌడ కన్నడతో భాషలోనూ అలాగే తమిళం, తెలుగులోనూ  పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. అలాగే అమరదీప్ కొన్ని ఓటిటి వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.