English | Telugu

Brahmamudi : రాజ్, కావ్యల వెంబడి రౌడీలు.. అప్పు కాపడగలదా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -740 లో....రాహుల్ తన నగలు దొంగతనం చెయ్యబోయాడని స్వప్న ఇంట్లో అందరిని పిలిచి చెప్తుంది. సొంత భార్య నగలు దొంగ చేసాడంటే వీడిని ఏం అనాలని స్వప్న తిడుతుంది. దాంతో స్వప్నకి నచ్చజెప్పి గొడవ కాకుండా అపర్ణ, ఇందిరాదేవి చూస్తారు. ఆ తర్వాత రాహుల్ ని బయటకు తీసుకొని వెళ్లి రుద్రాణి కొడుతుంది. నిన్ను సింహాసనం పై కూర్చొపెట్టాలని నేను అనుకుంటుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావంటూ వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత కావ్య, రాజ్ వెళ్తుంటే టీ తాగాలని ఉందని రాజ్ అంటాడు. కావ్య సరే అనడంతో ఒక దగ్గర ఆగుతారు. అక్కడికి యామిని పంపిన రౌడీలు వస్తారు. ఎలాగైనా వాళ్ళని రెచ్చగొట్టేల మాట్లాడి గొడవ చేసి ఏం డౌట్ రాకుండా కావ్యని చంపాలని అనుకుంటారు. టీ బాలేదని షాప్ అతనిపై రౌడీ టీ పోస్తాడు. రాజ్ కి కోపం వస్తుంది ఏంటి రా నీకు కోపం వస్తుందని రాజ్ ని రెచ్చగొట్టేల రౌడీలు మాట్లాడుతారు కానీ రాజ్ ని గొడవకిపోకుండా కావ్య ఆపుతుంది.

ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు అక్కడ నుండి బయల్దేర్తారు. వాళ్ళ వెంటే రౌడీలు ఫాలో అవుతారు. వాళ్ళ సంగతి చెప్తానని రాజ్ అంటుంటే.. వద్దని కావ్య ఆపుతుంది. ఒక దగ్గర రాజ్, కావ్య కార్ ఆపి అడవిలోకి వెళ్లిపోతారు రౌడీలు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలని అపర్ణకి కావ్య ఫోన్ చేసి సిచువేషన్ చెప్తుంది. వెంటనే అప్పుకి వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ లో ఉన్నారని చెప్తుంది అపర్ణ. తరువాయి భాగంలో రౌడీలకి కన్పించకుండా రాజ్, కావ్య దాక్కుంటారు. రౌడీలకి యామిని ఫోన్ చేసి కావ్యని లేపేయ్యమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.