English | Telugu

Brahmamudi : అనామిక స్కెచ్ లో అప్పు పడనుందా.. రాజ్ ఆఫీస్ కి రెడీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -768 లో.... రాజ్ కి ఆఫీస్ గురించి మొత్తం చెప్తుంది కావ్య. అన్ని ఫైల్స్ ముందు వేసి ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది. అలాగే నిద్రపోతుంది కానీ రాజ్ మాత్రం అన్ని ఫైల్స్ చూస్తాడు. తను కూడా కావ్య ఒళ్ళో పడుకుంటాడు. అప్పుడే అపర్ణ ఇందిరాదేవి వస్తుంది. వాళ్ళని చూసి హ్యాపీగా ఫిల్ అవుతారు. మరొకవైపు అప్పు స్టేషన్ కి రెడీ అవుతుంటే అప్పుడే అనామిక రౌడీలు ఫోన్ చేసి.. మేడమ్ డబ్బు నేను ఇవ్వాల్సిన అతనికి ఇస్తాను. అది మీ చేతుల మీదుగా ఇవ్వాలని కాల్ చేస్తాడు దానికి అప్పు సరేనని స్టేషన్ కి రమ్మని చెప్తుంది.

అప్పుడే కళ్యాణ్ వచ్చి అప్పు నువ్వు కొన్ని రోజులు సెలవు పెట్టు హనీమూన్ కి వెళదామని అంటాడు. ఇప్పుడు కుదరదని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాహుల్ చేసిన పనికి ఇందిరాదేవి ఇంట్లో పనులన్నీ రాహుల్ నే చెయ్యమని చెప్పడంతో రాహుల్ ఇంట్లో అన్ని పనులు అని చేస్తాడు. రాహుల్ తో అన్ని పనులు చేయిస్తుంది స్వప్న. మమ్మీ ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు.. నాకు ఈ శిక్ష నుండి బయటపడేయ్ అని రుద్రాణితో అంటాడు రాహుల్. రేపటి తో కావ్య పవర్స్ అన్ని పోతాయ్ వెయిట్ చెయ్ అని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత యామిని సిద్దార్థ్ కి ఫోన్ చేసి రాజ్ కి గతం గుర్తు లేదు.. రేపు నువ్వు అడిగే వాటికి రాజ్ సమాధానం చెప్పలేడు.. అప్పుడు అందరి ముందు కావ్య పరువు పోతుందని యామిని అంటుంది. అందుకు సిద్ధార్థ్ సరే అంటాడు. మరొకవైపు కావ్య రెడీ అయి రాజ్ కోసం చూస్తుంది. రాజ్ కి అన్ని నేర్పించావా కావ్య అని ఇందిరాదేవి అడుగుతుంది. అన్ని నేర్పించానని కావ్య అంటుంది. రాజ్ ఆఫీస్ కి రెడీ అయి కిందకి వస్తుంటే అందరు రాజ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.