Read more!

English | Telugu

Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్-8 అప్డేట్ .. కంటెస్టెంట్స్ ఎవరంటే!

 

బిగ్ బాస్ సీజన్-8 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసిందోచ్. తెలుగు టీవీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటు.. ఇప్పటికే విజయవంతంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే సీజన్-8 డేట్ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉంటేనే.. వామ్మో ఎవర్రా వీళ్లంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్-8 లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయంట‌. బిగ్ బాస్ సీజన్-7 సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌, రన్నర్‌గా అమర్‌ దీప్‌ నిలిచారు. అయితే స్పై అండ్ స్పా బ్యాచ్ మధ్య జరిగే ప్రతీ ఫైట్ , ప్రతీ వీక్ ఉత్కంఠభరితంగా సాగడం, హౌస్ లోని వాళ్ళంతా పోటాపోటీగా గేమ్స్ , టాస్కు లు ఆడటంతో అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీతోనే డాన్స్’ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యింది. అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. అయితే సీజన్-7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్-8 ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ‘నీతోనే డాన్స్’ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి.. అదే నెలలో బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభిస్తారంట. అయితే ఈ సీజన్ కి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడం కీలకంగా మారింది. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా నలభై మందిని కంటెస్టెంట్స్‌గా తీసుకోబోతున్నారట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి హౌస్ ని నిండుగా చూపిస్తారంట. అయితే టాస్క్ లు  కూడా ఈ సీజన్ భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ నలభై మందిలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అనిల్ జీలా, సుష్మ భూపతి, ఫార్మర్ నేత్ర, రైతుబడి రాజేందర్ రెడ్డి, రెండు లివర్లు ఎక్స్ ట్రా కుమారీ ఆంటీ వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలోని కొంత మంది ఇన్ ఫ్లూయన్సర్స్ ని బిబి మేకర్స్ ఇప్పిటికే సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి జూన్ నెల చివరి వారంలో గానీ అగస్ట్ లో గానీ మొదలయ్యే సీజన్-8 లో ఎవరెవరుంటారని? ఎవరుండాలని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.