English | Telugu
Bigg Boss 9 Telugu Tanuja : డీమాన్ ని రెచ్చగొట్టి ఓడిపోయేలా చేసిన తనూజ.. గ్రూప్ గేమ్ ఆడారు కదా!
Updated : Dec 3, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ ల పర్వం మొదలైంది. అయితే ఈ టాస్క్ లు కెప్టెన్సీ కోసం కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం.. అదే టికెట్ టూ ఫినాలే. దీనికోసం నిన్నటి నుండి హౌస్ లో టాస్క్ లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మొదటి టాస్క్ లో రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. ఇందులో ఇమ్మాన్యుయేల్ గెలిచి తన పక్కనున్న చదరంగంలోని రెండు గడులని సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత సంజనతో జరిగిన బాల్స్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ గెలిచి చదరంగంలో తన పక్కనున్న సంజన గడిని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత టాస్క్ ఆడటానికి తనూజ, డీమాన్ పవన్, భరణి వచ్చారు. వీళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'నాటు నాటు'. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న భిన్నమైన కలర్ ఫ్లవర్స్‌ని సేకరించి మట్టిలో నాటాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే నాటిన మొక్కలని ప్రత్యర్థి నుండి కాపాడుకోవాలి.. అలా చివరి వరకు ఎవరి మొక్కలు ఎక్కువగా ఉంటాయో వారే విజేత అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్కుకి కెప్టెన్ కళ్యాణ్ సంఛాలక్ గా ఉన్నాడు. టాస్కు మొదలుకాగానే ముగ్గురూ తమ కలర్ ఫ్లవర్స్‌ని తీసి మడ్ లో పెట్టారు. ఇక గేమ్ మొదలైంది. భరణి, తనూజ ఒక్కటైపోయి డీమాన్ ఫ్లవర్స్‌పై ఎటాక్ చేయడం మొదలెట్టారు. అది చూసిన డీమాన్ కూడా ఇద్దరిని రెండు చేతులతో ఆపేసి గ్రౌండ్‌లో కిందపడేశాడు. ఇక డీమాన్ ఎటాక్ తట్టుకోలే తోస్తావెందుకురా ఊరికే అంటూ డీమాన్ ని రెచ్చగొట్టింది. అడ్డొస్తే ఏం చేస్తాం..ఇది గేమ్ అని డీమాన్ అనగా ఫిజికల్ అవ్వమనలేదు.. మొక్కలు కాపాడుకోమన్నారని తనూజ ఇంకా రెచ్చగొట్టింది.
డీమాన్ ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూనే ఉంది. కానీ డీమాన్ ఒక్కడు ఒకవైపు.. భరణి, తనూజ ఇద్దరు మరోవైపు అన్నట్టుగా టాస్క్ సాగింది. తనూజ ఫ్లవర్స్ ని ఒక్కసారి కూడా భరణి తీసేయ్యలేదు. కానీ డీమాన్ పెట్టినవి తీసేసాడు.అలాగే భరణి ఫ్లవర్స్ ని తనూజ తీసేయలేదు కానీ డీమాన్ పెట్టిమ ఫ్లవర్స్ ని తనూజ తీసేసింది. ఇదే కదా సపోర్ట్ గేమ్. ఇక ఈ టాస్క్ లో తనూజ గెలిచింది. టికెట్ టూ ఫినాలే రేస్ లో నిలిచింది. అయితే తర్వాతి టాస్క్ లో గెలిస్తేనే తనూజకి ఛాన్స్ లేదంటే అవుట్. ఈ టాస్క్ లో ఎవరిది తప్పు.. ఎవరిది కరెక్ట్.. భరణి, తనూజ ఇద్దరు కలిసి డీమాన్ ని ఓడించారా లేదా కామెంట్ చేయండి.