Read more!

English | Telugu

కృష్ణ ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష వేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-105 లో.. కృష్ణ కోసం మురారి తీసుకొచ్చిన చీరని ముకుంద తనకి తెలియకుండా తీసుకుంటుంది. కాసేపటి తర్వాత ఆ చీర‌ని ముకుంద కట్టుకొని.. మురారి ముందుకి వస్తుంది. అప్పుడు మురారి ఆ చీరను చూసి షాక్ అవుతాడు. "ఏంటి మురారి ఈ రోజు నీ బర్త్ డే కాదు, నా బర్త్ డే కాదు.. ఎందుకు మరి ఈ రోజు నాకు చీర తీసుకొచ్చావ్.  నీ నుండి నేను ఈ ప్రేమనే కోరుకున్నానని ముకుంద అంటుంది. ఇప్పుడు ఈ చీర ముకుంద కోసం కాదు కృష్ణ కోసం అంటే లేనిపోని గొడవ అవుతుందని మురారి తన మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. ఇంతలో మురారిని భవానీ పిలవడంతో మురారి తన దగ్గరికి వెళ్తాడు.
 
"ఏంటి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు. ఈ ఇంటి కోడలు ఇంత లేట్ గా వస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు. ఈ ఇంటి కోడళ్ళు చీకటి పడకముందే ఇల్లు చేరాలి" అని భవాని అంటుంది. ఈ ముకుంద వల్ల కృష్ణని డ్రాప్ చేయడం.. పికప్ చేయడం లేదు పెద్దమ్మా.. కృష్ణ ఒక్కతే రావడం వల్ల లేట్ అవుతుందని మురారి అంటాడు. అక్కడే ఉన్న రేవతి ఆ మాటలు వింటుంది. ఇంటికి వచ్చాక కృష్ణని ఏమైనా అంటుందేమో అని భావిస్తుంది. నేను కృష్ణకి అర్థం అయ్యేలా చెప్తానులే అక్కా.. నువ్వు కృష్ణని వచ్చాక ఏం అనకు అని భవానీతో అంటుంది. ఇంతలో కృష్ణని గౌతమ్ ఇంటికి తీసుకొస్తాడు. గౌతమ్ బండి మీద కృష్ణని డ్రాప్ చెయ్యడం.. ఇంట్లో వాళ్ళందరు చూస్తారు. కృష్ణ లోపలికి వచ్చాక భవానీ ఆగమంటుంది. "ఎందుకు ఇంత లేట్ అయింది.‌ఎవరు అతను" అని కృష్ణని భవాని అడుగుతుంది. నాకు లేట్ అయిందని, మా సర్ ఇంటి వరకు డ్రాప్ చేసారని కృష్ణ చెప్తుంది. "ఇంటికి లేట్ గా వచ్చినందుకు, నీకు ఈ రోజు భోజనం లేదు. ఇదే నీకు లేట్ గా వచ్చినందుకు శిక్ష" అని భవానీ అంటుంది. సరేనని చెప్పేసి కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది.

మురారి గదిలోకి వెళ్ళి అతను కూడా కృష్ణను కోప్పడతాడు. ఈ రోజు త్వరగా వస్తా అని చెప్పావ్.. బయటకు వెళదామన్నావ్.. ఇంత లేట్ గా వచ్చావ్ అని మురారి అంటాడు. "అక్కడ గొడవ అయిపొయింది.. ఇప్పుడు ఇక్కడ నువ్వు మొదలెట్టావా" అని కృష్ణ అంటుంది. నేను ఇంకో సంవత్సరం ఉంటానని కృష్ణ అంటుంది. మురారి డల్ అయిపొయి కృష్ణ గురించే ఆలోచిస్తాడు.. భోజనం తీసుకొని నందు దగ్గరికి కృష్ణ వెళ్తుండగా ముకుంద చూస్తుంది. నిన్ను పెద్ద అత్తయ్య భోజనం చెయ్యద్దని చెప్పింది కదా.. ఎందుకు భోజనం ప్లేట్ లో వేసావ్ అని ముకుంద అనగానే.. "నువ్వు మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్. గాడిద పని గాడిదే చెయ్యాలి. కుక్క పని కుక్కే చెయ్యాలి. ఈ భోజనం నందు కోసం" అని చెప్పి వెళ్ళిపోతుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.