English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి సాయంతో అమూల్యని కిడ్నాప్ చేసిన విశ్వ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -377 లో.... అమూల్య పెళ్లికి రామరాజు ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇంట్లో ఆడవాళ్ళ అందరు పసుపు దంచుతారు. అప్పుడే భాగ్యం వస్తుంది. శ్రీవల్లి తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ఆనందరావు కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్ళు పిలవడంతో శ్రీవల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీ అమ్మ ఒక్కతే కనిపిస్తుంది. మీ నాన్న ఎక్కడ అని అడుగుతారు. కిడ్నాప్ అయ్యాడని శ్రీవల్లి నోరు జారుతుంది. ఏంటని అందరు అడుగగా కవర్ చేస్తుంది.

నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్, చందు శ్రీవల్లి జంటలుగా కలిసి పసుపు దంచుతారు. మరొకవైపు భద్రవతి వాళ్ళ పెద్దమ్మ వేదవతి దగ్గరికి వెళ్తానంటే వద్దని భద్రవతి అంటుంది. అయినా వినకుండా వేదవతి దగ్గరికి బయల్దేరుతుంది. అమూల్యకి పసుపు రాస్తారు. ప్రేమ చెంపకి పసుపు అంటితే కర్చీఫ్ ఇచ్చి తుడుచుకోమని ధీరజ్ అంటాడు. నువ్వు ఇలా ఎప్పుడు మారిపోయావు రా అని ప్రేమ అంటుంది. ధీరజ్ కర్చీఫ్ తో తన చెంపని తుడుస్తాడు. ఆ తర్వాత వేదవతి వాళ్ళ పెద్దమ్మ రాగానే వేదవతి ఎదురు వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అమూల్య దగ్గరికి వెళ్లి చాలా చక్కగా ఉన్నావని వేదవతి‌ వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఆ తర్వాత తను ప్రేమ, నర్మదలని ఆశీర్వదిస్తుంది. నీ కూతురికి ఏదైనా చేయించమని కొంత డబ్బులు వేదవతికి ఇచ్చి వెళ్తుంది.

ఆ తర్వాత రాత్రి రామరాజు సంతోషంతో డ్రింక్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకీ వస్తారు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నా కూతురు అని అమూల్య గురించి గొప్పగా మాట్లాడుతాడు. ఆ తర్వాత సంగీత్ కి వనజ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. తరువాయి భాగంలో ఇంట్లో కరెంటు అఫ్ చేసి భాగ్యం, శ్రీవల్లి సహాయంతో అమూల్యని కిడ్నాప్ చేస్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.