Read more!

English | Telugu

అఖిల్ ని వరించిన బెస్ట్ పాపులర్ టీవీ ఆర్టిస్ట్ అవార్డ్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారఅఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో  తన గురించిన అప్డేట్ లని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.  అయితే తాజాగా తనకి బెస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ ఆన్ టీవీ అవార్డ్ వచ్చిందని అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. సౌత్ టెలివిజన్ వారు ప్రెజెంట్ చేసిన ఈ అవార్డ్ తనకి చాలా సంతోషాన్నిచ్చిందంటూ.. ఈ అవార్డ్ రావడానికి కారణం నన్ను ఇష్టపడిన ప్రేక్షకులే అని, వారందరికి థాంక్స్ అంటూ అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పాడు.