Read more!

English | Telugu

సంగీతం, అక్షరాలు రాకపోయిన పాడేయొచ్చని చెప్తున్న బాలాదిత్య కూతురు!

నాకు అక్షరాలు రావు.. సంగీతం రాదు.. కానీ పాడేస్తాను. ఏంటిది అనుకుంటున్నారా కొందరు పాడే పాటలకి ఇవేం అక్కర్లేదు. పాడాలనే జిజ్ఞాస ఉంటే  సరిపోతుంది. చిన్నపిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ వాళ్ళు మాట్లాడేది వింటేనే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అదే వాళ్ళు పాటలు పాడితే మరింత క్యూట్ గా ఉంటుంది‌. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన ఆ పాప ఎవరో కాదు బాలాదిత్య కూతురు యజ్ఞ విధాత్రి. తనకి పాట సాహిత్యం, పదాలు,  రాగాలు ఏవీ తెలియకపోయినా పాడేస్తుంది.

తాజాగా బాలాదిత్య ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురు పాడిన ఈ పాటని అప్లోడ్ చేయగా దానికి మంచి వీక్షకాధరణ లభిస్తోంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ ఆరోహి రావు, కీర్తిభట్ లు  తమ కామెంట్లతో అభినందనలు తెలుపుతున్నారు. బాలాదిత్య ఎంత పెద్దవాడైనా ఇద్దరు పిల్లలకు తండ్రైనా కూడా ఇంకా బాలనటుడిగానే అందరికీ గుర్తొస్తాడు. బాలాదిత్య ఆల్ రౌండర్. బాలనటుడిగా సుమారు 40 సినిమాల్లో నటించాడు.  ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ , అన్న, ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’  లిటిల్ సోల్జర్స్ వంటి మూవీస్ లో  చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. లిటిల్ సోల్జర్స్ మూవీకి నంది అవార్డు అందుకున్నాడు. 1940 లో ఒక గ్రామం అనే మూవీకి  నేషనల్ అవార్డును అందుకున్నాడు.

2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీలో నటించాడు. రీసెంట్ గా " మా ఊరి పొలిమేర" అనే చిత్రంలో కూడా  నటించాడు. హీరోగా మంచి బ్రేక్ రాకపోయేసరికి ఫైనల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు.. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి మార్క్స్ కూడా సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన రెండో కూతురు యజ్ఞ విధాత్రితో కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పాడిన ఓ పాట నెట్టింట వైరల్ గా మారింది.