Read more!

English | Telugu

హాస్పిటల్ లో అష్షు రెడ్డి... బ్లడ్ కావాలా?


ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి. కామన్ పీపుల్ ఐనా సెలబ్రిటీస్ ఐనా సరే ఫీవర్ వచ్చిందటే బెడ్ మీద పడాల్సిందే. ఇప్పుడు అదే  వైరల్ ఫీవర్ బారిన పడింది అష్షు..  ఆమె బ్రదర్ కూడా ఫీవర్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు . హాస్పిటల్ లో ఇద్దరూ సెలైన్ ఎక్కించుకుంటూ పడుకుని ఉన్నారు. ఈ విషయాన్ని వీడియోస్ తో సహా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది అష్షు.." అన్ని చోట్ల వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెప్పి కాప్షన్ పెట్టింది.

ఇక అష్షు ఫ్రెండ్ దీక్ష పంత్ తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. "నీకేమన్నా కావాలంటే చెప్పు..బ్లడ్ కావాలన్నా అడుగు" అని పోస్ట్ చేసింది. "నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వంటే నాకు అందుకే చాల ఇష్టం..." ఆమెకు రిప్లై ఇచ్చింది.  ఇక బుల్లితెర కమెడియన్స్ యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, అష్షు హెయిర్ స్టైలిస్ట్ రవి అంతా కూడా "గెట్ వీల్ సూన్" అంటూ మెసేజెస్ పెట్టారు. "ఎవరూ ఇబ్బంది పడకండి...త్వరలో నేను మంచిగా తిరిగి వస్తాను.

మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు" అంటూ ఫాన్స్ కి అష్షు భరోసా ఇచ్చింది.  బిగ్‌బాస్ సీజ‌న్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది అష్షు కానీ ఫైనల్స్ కి వెళ్లలేకపోయింది ఈ జూనియర్ సమంత.  ఇక రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూల ద్వారా ఈ అమ్మడు బాలా పాపుల‌ర్ అయ్యింది. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ క్రియేట్ చేసిన  సెన్సేషన్ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.