Read more!

English | Telugu

శ్రీసత్యతో కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్!

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో ఈ పేరు అందరికి సుపరిచితమే. అతను బిగ్ బాస్ లో ఉన్నంతవరకు శ్రీసత్య చుట్టూ తిరగడంతో షో కోసం పబ్లిసిటీ కోసం చేసాడని అనుకున్నారంతా కానీ అతను బయటకొచ్చాక ఒక్క శ్రీసత్య కోసమే తను బిగ్ బాస్ కి వెళ్ళినట్లు అర్జున్ చెప్పడంతో అందరి మద్దతు అతనికి లభించింది. అయితే బిగ్ బాస్ తర్వాత బిబి జోడీ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అర్జున్-వాసంతి జోడీలుగా పర్ఫామ్ చేస్తున్నారు. 

అయితే ఆదివారం 'విత్ అర్జున్.. ఆస్క్ మీ సంథింగ్' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టాడు అర్జున్. దీంతో తన అభిమానులంతా క్వశ్చనింగ్ స్టార్ట్ చేసారు. చాలా క్వశ్చన్స్ రాగా అందులో నుండి కొన్నింటికి మాత్రం సమాధానాలు చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టాడు అర్జున్ కళ్యాణ్. బిబి జోడీ జర్నీ తో మీరు హ్యాపీగా ఉన్నారా అంటూ ఒక అభిమాని ప్రశ్న అడుగగా.. " ఎస్ డెఫినెట్లీ.. ఎందుకంటే నా ట్యాలెంట్ ని, డ్యాన్స్ ని, యాక్టింగ్ ని నిరూపించుకోడానికి ఇదొక మంచి ఫ్లాట్ ఫామ్.‌ ఫస్ట్ టూ వీక్స్ లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత నేను వసంతి కలిసి బాగా ప్రాక్టీసు చేశాం" అని చెప్పాడు.  బిబి జోడిలో‌ మీ ఫేవరెట్ జోడీ ఎవరని అడుగగా.. సండే జోడీలలో‌ అయితే రవి-భాను జోడి, శనివారం జోడీలలో అఖిల్-తేజస్విని జోడి అంటే ఇష్టం. ఎందుకంటే తేజస్విని డ్యాన్ బాగా చేస్తుంది. ఆ తర్వాత సూర్య-ఫైమా జోడీ అంటే ఇష్టమని చెప్పాడు.  

శ్రీసత్యతో మీ ఫ్రెండ్ షిప్ ఎలా ఉందని ఒకరు అడుగగా.. "కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్. కీప్ ఫైటింగ్ అండ్ పాచింగ్.. బట్ స్టిల్ వీ ఆర్ ఇన్ టచ్. అన్ అఫిషీయల్ గా కలుస్తుంటామని అర్జున్ చెప్పాడు.  సత్యతో కలిసి ఒక పర్ఫామెన్స్ లేదా రీల్ అయినా చేయొచ్చు కదా అని ఒకరు అడుగగా.. బిబి జోడిలోనే ఒక పర్ఫామెన్స్ చేసాం బట్ అది ఎడిట్ లో లేపేసారు. రీల్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్‌ సత్య .. ఏం అంటావ్ సత్య రీల్ అంట చేద్దామా అని సమాధనమిచ్చాడు అర్జున్. ఎలా ప్రతీదానిని పాజిటివ్ గా తీసుకోగలుగుతున్నారని ఒకరు అడుగగా.. " నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకొని పాజిటివ్ గా తీసుకోడానికే ట్రై చేస్తుంటాను. నిన్నటి పర్ఫామెన్స్ లో సదా మేడం నన్ను ఒక కుక్కలా చేసావ్ అని చెప్పడంతో దాన్ని తీసుకొని నన్ను చాలా మంది ట్రోల్ చేసారు. ఆ ట్రోలింగ్స్ అన్నీ చూసాను. కానీ వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని పాజిటివ్ గా తీసుకున్నాని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మీ ఫెవరెట్ హీరో ఎవరని అడుగగా.. పవర్ స్టార్ మ్యానరిజంతో తను వసంతి కలిసి చేసిన పర్ఫామెన్స్ లోని ఒక ఫోటోని పోస్ట్ చేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పాడు అర్జున్ కళ్యాణ్. మీ అమ్మ నాన్నల ఫోటోలని చూపిస్తారా అని ఒక అభిమాని ప్రశ్నించగా.. అమ్మ, నాన్నలతో కలసి తను దిగిన ఫోటోలని కూడా పోస్ట్ చేసాడు.