English | Telugu

యాంకర్ రవి కారును ఆపేసిన మందుబాబు!

బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవి పలు షోలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. లాస్యతో కలిసి రవి చేసిన 'సంథింగ్ సంథింగ్' షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తరువాత యాంకర్ శ్రీముఖితో కలిసి హోస్ట్ చేసిన 'పటాస్' షో రవికి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం రవి 'డ్రామా జూనియర్స్', 'కామెడీ స్టార్స్' వంటి షోలతో బిజీగా గడుపుతున్నాడు. దాదాపు ఐదేళ్ల తరువాత మళ్లీ లాస్యతో కలిసి టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా రవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. హైదరాబాద్ కావూరి హిల్స్ ఏరియాలో ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి వాహనాలను అడ్డుకుంటూ కాసేపు హడావిడి చేశాడు. అటుగా వెళ్తున్న యాంకర్ రవి కారుని కూడా ఆపడంతో కారులో ఉన్న రవి చేసేదేం లేక సదరు వ్యక్తి చేస్తోన్న హంగామాను ఫోన్‌లో బంధించాడు. ఆ తరువాత వీడియోకి 'సర్దార్‌ గబ్బర్ సింగ్' సినిమాలోని ఓ పాటని యాడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

''మంచి, చెడు చెబుదామంటే మొహానికి మాస్క్ లేదు.. మైండ్ కంట్రోల్‌లో లేదు కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన ముఖం మీద చిరునవ్వు చూస్తే ఎక్కడో కాస్త ఆనందంగా ఉంది. అవును.. నిజమే.. మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి'' అంటూ క్యాప్షన్ జోడించాడు రవి. "అతడ్ని దేవుడు సేఫ్ గా ఉంచాలని కోరుకుంటున్నా" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.