English | Telugu

అషురెడ్డిని అడవిపందితో పోల్చిన ర‌వి.. వీడియో వైర‌ల్‌!

యాంకర్ రవి, అషురెడ్డిలు బుల్లితెరపై 'హ్యాపీడేస్' అనే షోతో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా 'హ్యాపీడేస్' టీమ్ తెగ రచ్చ చేస్తోంది. ఈ షో ప్రమోషన్స్ కోసం రవి, అషురెడ్డి బాగానే కష్టపడుతున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో షో గాడిలో పడింది. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ జోడీ నవ్వులు పూయిస్తోంది.

తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో వీరిద్దరి సంభాషణ అందరినీ నవ్విస్తోంది. అషురెడ్డిని యాంకర్ రవి మోసం చేసి తీసిన వీడియో వైరల్ అవుతోంది. తాజాగా షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికిన అషురెడ్డి, రవిలు రీల్ వీడియోలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా థైస్ క‌నిపించేట్లు చిన్న రెడ్ ఫ్రాక్ వేసుకున్న అషురెడ్డితో ఓ రొమాంటిక్ వీడియో చేస్తానని రవి చెప్పాడంట‌. అషురెడ్డి ఏదో తింటూ అలా నడిచి వస్తున్న వీడియోకి రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్‌ చేస్తానని రవి నమ్మించి మోసం చేశాడట.

ఫైనల్‌గా ఆ వీడియోను ఆమెకి తెలియకుండానే ఫన్నీగా ఎడిట్ చేశాడు. బ్యాగ్రౌండ్‌లో "హైద‌రాబాద్ వనస్థలిపురం పార్క్ లోకి వ‌చ్చిన ఓ అడవి పంది కాసేపు అంద‌ర్నీ భ‌య‌పెట్టింది. పార్కులో అడ‌విపంది క‌నీసం నాలుగు గంట‌ల పాటు దొరక్కుండా తిరిగింది." అనే ఓ లేడీ వాయిస్ యాడ్ చేశాడు. "ఐయామ్ సో సారీ అషు.. ఈ వీడియో చూశాక పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నా. న‌వ్వి న‌వ్వి నా లంగ్స్ బ‌య‌ట‌కొచ్చేట్లున్నాయి." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు రవి.

ఇది చూసిన అషు "ఓ మై గాడ్‌.. నువ్ కూడా నాకు తొంద‌ర్లో దొరుకుతావ్ ర‌వీ.. కానీ న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోయాను" అంటూ రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.