English | Telugu

పదహారేళ్లు వ‌చ్చేదాకా నాకు ఫోన్ ఇవ్వ‌రు!

 

యాంకర్ రవి కూతురు వియాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. రవి చేసే వీడియోలతో పాటు తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్ లో వియా అల్లరి చేస్తుంటుంది. తన తండ్రి ప్రోత్సాహంతోనే యూట్యూబ్ ఛానెల్ పెట్టానని వియా చెప్పుకొచ్చింది. రీసెంట్ గా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది వియా. ఈ క్రమంలో నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. 

సుధీర్ మామ, అనసూయ పిన్ని, లాస్య ఆంటీ అంటూ అందరి గురించి వియా మాట్లాడింది. తన వ్యక్తిగత విషయాలపై కూడా వియా కామెంట్స్ చేసింది. "ఈ సమాధానాలన్నీ నువ్వే చెబుతున్నావా..? లేక ఎవరైనా సాయం చేస్తున్నారా..?" అని ఓ నెటిజన్ అడగగా.. దానికి వియా బదులిస్తూ.. "మా అమ్మ ప్రశ్నలను చదివి వినిపిస్తుంటే నేను సమాధానాలు చెబుతున్నా." అని తెలిపింది. 

మరో నెటిజన్ "నీకు సొంతంగా ఫోన్ ఉందా..?" అని ప్రశ్నించాడు. దానికి వియా.. తన దగ్గర ఫోన్ లేదని.. తనకు 16 ఏళ్లు వచ్చే వరకు ఫోన్ కొనివ్వరని పేరెంట్స్ చెప్పినట్లు వియా తెలిపింది. యాంకర్ రవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఫోన్ లేకపోయినా.. వియా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.