Read more!

English | Telugu

నీతోనే డాన్స్ స్టేజి మీద ఏడ్చేసిన నేహా...

 



నీతోనే డ్యాన్స్  సీజన్ 2 ప్రతీ వారం డాన్స్ లవర్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది.  బిగ్ బాస్‌లో అలరించిన సెలబ్రిటీలు ఇక్కడ వాళ్ళవాళ్ళ జోడీలతో పెర్ఫార్మ్ చేస్తున్నారు.  ఈ షోపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి ఐనా కూడా సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తోంది. మానస్-శుభశ్రీ రాయగురు, విశ్వ-నేహా, దర్శన గౌడ-పృథ్వీ శెట్టి, నయని పావని-ప్రిన్స్ యావర్, బాలాదిత్య-పూజా మూర్తి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హరిక ఈ జంటలన్నీ వాళ్ళ  డ్యాన్సులతో అలరిస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పింది శ్రీముఖి.

కంటెస్టెంట్స్ అంతా మార్కుల కోసం అరుచుకుంటున్న టైంలో  విశ్వ-నేహా  జంట వచ్చింది. నేహా స్టేజి మీదకు  కన్నీరు పెట్టుకుంటూ వచ్చింది. ఆమె వెంట విశ్వ కూడా వచ్చాడు.  ఇందులో నేహా మెడకు బెల్ట్ పెట్టుకుని వచ్చింది. ఏదో  గాయం అయినట్లు కనిపిస్తోంది. అంతలో సదా ఏమైంది అని అడగగానే. ‘నేను ఇలా ఎంట్రీ ఇస్తానని ఎప్పుడు అనుకోలేదు’ అంటూ ఏడ్చేసింది నేహా.   నేహా ఐపీఎల్ కు స్టార్ స్పోర్ట్ తెలుగులో యాంకరింగ్ చేసి పాపులర్ అయ్యింది నేహా. పలు మ్యాచులకు ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ఆమె డ్యాన్సర్, మోడల్ కూడా. బిగ్ బాస్ సీజన్ 6 లో  అలరించింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్ ను పెళ్ళిచేసుకుని వేరే కంట్రీ కూడా వెళ్ళిపోయింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజే పెళ్లి చేసుకుంది నేహా. ఆ పెళ్లి డ్రెస్ తోనే బిగ్ బాస్ కి వచ్చే సర్ప్రైజ్ ఇచ్చింది.  అలాంటి నేహా మెడకు అసలు ఏమయ్యిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.