Read more!

English | Telugu

టైంకి షూట్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అనేదే నా డిమాండ్

 

సుమ అడ్డా షోలో ఈ వారం ఏజెంట్ టీం నుంచి హీరో, హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళతో ఎన్నో రకాల ఫన్నీ గేమ్స్ ఆడించింది సుమ. తర్వాత ఎన్నో ప్రశ్నలు కూడా వేసింది. "మీరు నటించిన హీరోయిన్స్ తో డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోయిన్ తో వెళ్తారు" అనేసరికి "పూజ హెగ్డేతో వెళ్తాను" అని చెప్పాడు అఖిల్. "బాగా ఇష్టమైన హీరో ఎవరు"..."రామ్ చరణ్ ". "ఇండియన్ క్రికెట్ టీంలో ఆడే ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారా" అని అడిగింది సుమ.."తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాను అది సాధ్యమా ? ఈ జన్మకు సాధ్యం కాదు" అని చెప్పాడు "బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్నకు  క్రికెట్ ఆడతాను" అన్నాడు .."మీరు చేసిన పనుల్లో నాగార్జునగారికి ఇప్పటికీ తెలియని ఒక పని చెప్పండి" "రాత్రి పూట గోడ దూకేసి బయటికి వెళ్ళిపోయి..రావడం..అదొక అడ్వెంచర్ నాకు. మా ఇంటి గోడ కూడా 25 అడుగుల ఎత్తు ఉంటుంది" అని చెప్పడంతో సుమ షాకయ్యింది.

 " ఇది చూసారా నాగార్జున గారు చూసారా  25 అడుగుల ఎత్తున్న గోడ కట్టించారు ఏం లాభం..ఐనాసరే దూకేసాడు..ఇవన్నీ మీకు తెలుసు కదా..మీకు తెలుసు అంటే మీరు కూడా ఇవన్నీ చేసినట్టే కదా చిన్నప్పుడు. మీరు మీ అబ్బాయిని ఎలిమినేట్ చేయలేరు" అని ఫన్ చేసింది సుమ .."స్కూల్లో మీరు ఫస్ట్ ప్రొపోజ్ చేసిన అమ్మాయి ఎవరు" అని అడిగింది "ఫస్ట్ నేను ప్రొపోజ్ చేయలేదు...నాకు ప్రొపోజల్ వచ్చింది..ఆ ప్రొపోజల్ ని యాక్సెప్ట్ చేసాను" అని చెప్పడంతో అవాక్కయ్యింది. "ఒక స్టార్ హీరో కొడుకుగా షూటింగ్ స్పాట్ లో చేసే డిమాండ్స్ ఏమన్నా ఉంటాయా".. "టైంకి షూట్ స్టార్ట్ చేయండి ప్లీజ్" ఇదే నా డిమాండ్ అని చెప్పాడు అఖిల్.