Read more!

English | Telugu

సీరియల్ ఆర్టిస్టులు పడే కష్టాల గురించి చెప్పిన యమున!


సినిమాలో నటించే వారికి, సీరియల్స్ లో నటించేవారికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో పాత్ర దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఉండాలి. అయితే సీరియల్ నటీనటులకి సపరేట్ గా క్యారీ వాన్ లు ఏవీ ఉండవంటు వారి కష్టాలని చెప్పుకొచ్చింది యమున.

ఎన్నో సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నటి యమున. ఇప్పటికీ సీరియల్స్‌లో నటిస్తూ ఎవర్‌గ్రీన్ బ్యూటీ అనిపించుకున్నారు. 1990ల్లోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు నటి యమున. వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలు చేస్తూనే సడెన్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చారు. విధి, అన్వేషిత, రక్త సంబంధం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్ చేశారు. ఇప్పటికీ ధారావాహికల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి , సీరియల్ ఆర్టిస్టుల కష్టాల గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అని అడుగగా.. సీరియల్ లో చేసేవారికి నిజంగా దండం పెట్టాలండి. విలన్ పాత్రలు చేసేవారు మరీ . వారికి హెవీ జ్యువలరీ ఉండాలి. సారీకి తగ్గట్టు మ్యాచింగ్ ఉండాలి. రిచ్ గా ఉండాలని డైరెక్టర్ చెప్తారు. ఇక ప్రొడక్షన్ ఫుడ్ కూడా తినలేరు. ఇంటి నుండే భోజనం తెచ్చుకోవాలని యమున చెప్పుకొచ్చింది. సినిమా అయితే రెండు మూడు సీన్లు ఉంటాయి. క్యారీ వ్యాన్ ఉంటుంది. వస్తారు సీన్ చేసేసి క్యారీవ్యాన్ లో కూర్చుంటారు కానీ సీరియల్ యాక్టర్స్ అవేమీ ఉండవని షూటింగ్ లో తను ఫేస్ చేస్తున్న కొన్ని విషయాలని చెప్పుకొచ్చింది.

టాక్సీవాలా మూవీలో ఆస్తమా సీన్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది యమున. ఏ సినిమాకి అయిన స్టోరీ చెప్పేటప్పుడే కాస్త ఆ క్యారెక్టర్ బిహేవియర్, ఎలా చేయాలని అంతా ప్రిపేర్ అవుతాను. ఇలా ఆస్తమా రావాలని డైరెక్టర్ చెప్పడంతో ముందుగా గూగుల్ చేశా ఎలా ఉండాలో ఆ తర్వాత ‌ నా సీన్ వచ్చినప్పుడు అది అప్లై చేశా.. సీన్ బాగుందని, ఎలా చేశారని డైరెక్టర్ అడిగినప్పుడు.. అదేం లేదండి.. నేను గూగుల్ లో చూశానని యమున అంది. ఆర్జీవి గురించి ఎవరేం చెప్పిన వినను. ఆయనేంటో నాకు తెలుసు. నేను బంగారు కుటుంబం మూవీ చేస్తున్నప్పుడు బయట అలా కూర్చొని ఉండగా.. ఆర్జీవీ గారు అలా వెళ్తూ నన్ను ఒక్కసారి అలా చూసాడు. ఆ తర్వాత రోజు మా మేనేజర్ కి కాల్ చేసి గోవింద గోవింద సినిమాలో లక్ష్మీ పాత్ర చేయాలని చెప్పారు. అంటే ఆర్జీవీ గారు నాలో లక్ష్మీదేవిని చూసారని యమున అంది. ఇలా కొన్ని సినిమాల గురించి సీరియల్ లో కష్టాల గురించి యమున తన మాటల్లో తెలుగువన్ తో పంచుకుంది‌. మరి యమున నటించిన వాటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? సీరియల్ ఏంటో కామెంట్ చేయండి.