Read more!

English | Telugu

ఆ సీరియ‌ల్‌కు రాశి రెమ్యూనరేషన్ ఇదే!

 

ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగ‌మ్మాయి రాశి.. ఒకానొక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోల‌తో వెండితెరపై రొమాన్స్ చేసిన రాశి 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అగ్ర దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. 

'నిజం' సినిమాలో ఆమె నెగ‌టివ్ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురయ్యాయి. ఆ పాత్ర పోషించినందుకు రాశి ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి.. మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో హీరో త‌ల్లి జ్ఞానాంబగా అలరిస్తోంది. 

ప్రస్తుతం ఈ సీరియల్ కు మంచి రేటింగులే వస్తున్నాయి. రాశి పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రాశికి అభిమానూలు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో అలరిస్తున్న రాశి ఈ సీరియల్ కోసం మంచి రెమ్యూనరేషనే తీసుకుంటోంది. ఆమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఆర్థిక‌ ఇబ్బందుల వలనే రాశి సీరియల్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ ప్ర‌చారాన్ని రాశి ఖండించింది.