Read more!

English | Telugu

పుట్టపర్తి సాయిబాబా తనని చూసాడని చెప్పిన ఇంద్రజ!

ఇంద్రజ.. ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే సినిమా 'యమలీల'. యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన 'యమలీల' సినిమా లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.. అప్పట్లో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నారు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు తన కెరియర్ ని కొత్తగా మలుచుకుంటున్నారు. జబర్దస్త్ లో జడ్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంద్రజ.. ఇప్పుడు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' లో కూడా జడ్జ్ గా  వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..

ఇంద్రజ అందరితో హంబుల్ గా ఉంటూ ఎవరినీ నొప్పించక, కష్టాలలో ఉన్నామని ఎవరైనా చెప్పిన వెంటనే కరిగిపోతుంది. వారికి తన వంతు సాయం కూడా చేస్తుంది. అయితే సంప్రదాయ చీరకట్టుతో ఎప్పుడూ కనిపించే ఇంద్రజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.  అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

"నేను పుట్టపర్తి సాయిబాబాను ఆరాధిస్తాను. ఒకరోజు నేను యూట్యూబ్ షార్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు నా ఫోటోలు ఉన్న షార్ట్ వీడియో పక్కన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు. అయితే బాబా గారు ఒక ఫోటోలో మాములుగా ఉండగా.. మరొక ఫోటోలో నన్ను చూస్తున్నట్టుగా ఉన్నారు. అది చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. నేను నమ్మే బాబా.. నన్ను చూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది" అంటూ ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని పోస్ట్ చేసింది.