Read more!

English | Telugu

అఖిల్ ని చూసి ఫ్లాటైపోయిన హీరోయిన్ ఆనంది...

జీ తెలుగులో ప్రసారమవుతున్న "డాన్స్ ఇండియా డాన్స్" షో త్వరలో ముగియబోతోంది. ఈ షోకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం అంటే 22 న రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే షోకి వెరైటీ లుక్ తో హీరో అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అఖిల్ ఎంట్రీ కంటెస్టెంట్స్ లోనే కాదు జడ్జెస్ లో కూడా ఉత్సాహాన్ని పెంచింది. త్వరలో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న 'ఏజెంట్' లుక్‌లో అఖిల్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు.

ముగ్గురు జడ్జెస్ లో ఒకరైన హీరోయిన్ ఆనంది.. అఖిల్‌ను చూసి తెగ సంబరపడిపోయింది. పడీ పడీ నవ్వింది. "అఖిల్‌ని ఇలా చూస్తుంటే ఇంత ఫాస్ట్ గా పెళ్లి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తోంది.." అనేసరికి అఖిల్‌ తెగ సిగ్గుపడ్డాడు. మొత్తానికి ప్రోమోతో షోకు బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మరోవైపు "జబర్జస్త్" లేడీ కమెడియన్ రోహిణి.. 'అయ్యగారే నం.1' అనేసరికి  అందరూ నవ్వేశారు. అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్న ఈ డాన్స్ షో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న మొదలయ్యింది. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, యాక్టర్ సంగీత, హీరోయిన్ ఆనంది జడ్జెస్ గా  ఉన్నారు. జబర్దస్త్ రోహిణి కూడా ఈ షోలో కనిపిస్తూ కామెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు  'ఏజెంట్' మూవీతో అఖిల్ ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతున్నాడు.