Read more!

English | Telugu

భవాని కుటుంబసభ్యుల సంతోషానికి కారణం కృష్ణేనా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -76 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు నాటి ఎపిసోడ్ లో.. భవానీ ఇంట్లో అందరు భోజనం చెయ్యడానికి కూర్చుంటారు. ఇంకా భవాని భోజనం చెయ్యడానికి రాకపోయేసరికి. నేను వెళ్ళి తీసుకొస్తాను అని రేవతి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి రేవతి.. "అక్కా.. అందరూ భోజనం చెయ్యడానికి వచ్చారు. రా అక్కా" అని అనగానే.. "నేను రాను. ఇంట్లో ఎవరికీ వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.. నీలాగా బావిలో కప్పలాగా నీ కోడలిని తయారు చేద్దామనుకుంటున్నావా?  ఇంట్లో నన్ను అడగకుండా నువ్వే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. కృష్ణ వాళ్ళ అమ్మ నాన్నల కలని నిజం చేస్తానని అనుకుంటుంది.. నువ్వు ఎందుకు వద్దు అంటున్నావ్" అని భవానీ అడుగుతుంది. కృష్ణ దూరం వెళ్తే ముకుంద, మురారికి దగ్గర అవుతుంది అక్కా.. నీకెలా చెప్పాలి అని రేవతి మనసులో అనుకుంటుంది. భవాని అడిగిందానికి సమాధానం చెప్పకుండానే.. కిందకి వెళ్లి మీరు తినండి అని అనగానే.. "వదిన రానందా.. ఎందుకు రానని చెప్పింది" అని అంటాడు ఈశ్వర్. మీరు అడిగిందే అక్కా అడిగింది అని రేవతి చెప్పి.. వాళ్ళని తినమంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తారు.

అలేఖ్య నాకేంటి కుడికన్ను అదురుతుందని అనుకుంటుండగా ఆదర్శ్ ఫోటో దగ్గర నిల్చొని ఉన్న ఆర్మీ ఆఫీసర్ ని చూసి ఆదర్శ్ వచ్చాడేమోనని ఇంట్లో అందరికి చెప్తుంది. అందరూ ఒక్కసారిగా సంతోషంతో హల్ లోకి వస్తారు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. హాల్ లోకి వచ్చి చూసేసరికి ఆదర్శ్ ఫోటోని చూస్తున్న ఆర్మీ ఆఫీసర్ ని చూసి అందరూ షాక్ అవుతారు. ముకుంద మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. "కృష్ణ అంటే ఎవరు? ఆవిడ  ఆదర్శ్ ని వెతకమని పంపిన మెయిల్స్ వల్ల అతని గురించి తెలుసుకోగలిగాం. ఆదర్శ్ బ్రతికే ఉన్నాడు. తొందరలోనే ఎక్కడ ఉన్నాడో, తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తామని, కమాండర్ మీకు చెప్పమని నన్ను పంపించాడు" అని ఆర్మీ ఆఫీసర్ చెప్పడంతో అందరూ సంతోషపడతారు. నా కొడుకు, కోడలు పూజ చేయడం వల్లే ఆదర్శ్ గురించి తెలిసిందని రేవతి ఆనందపడుతుంది. "పూజ చేయడమే కాకుండా వాళ్ళకి మెయిల్స్ పంపిండం వల్లే వాళ్ళు వెతికారు. ఆచూకీ తెలిసింది.. ఇదంతా కృష్ణనే చేసింది" అని ఈశ్వర్ అంటాడు. ముకుంద కంగ్రాట్స్ ఆదర్శ్ వస్తున్నాడని కృష్ణ చెప్పడంతో.. "ఈ తింగరి పిల్ల నీ కోసం ఎంత పని చేసిందో.. నువ్వు తనకి నిజంగానే  థాంక్స్ చెప్పాలి" అని భవాని అంటుంది.
 
"ఇది మా కుటుంబానికి చాలా గ్రేట్ న్యూస్.. థాంక్యూ సర్"  అని ఆర్మీ ఆఫీసర్ తో మురారి అంటాడు. మురారి అలా సంతోషంగా ఉండడంతో.. ఏంటీ మురారి, ఆదర్శ్ వస్తే నన్ను వదిలించుకోవచ్చు. నా టార్చర్ ఉండదు అనుకుంటున్నావా అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ గురించి తెలిసేసరికి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.