Read more!

English | Telugu

రాజ్ తో స్వప్న డేటింగ్ కి కనకం చేస్తోన్న హడావిడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్-15 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో.. స్వప్న వాళ్ళింట్లో స్వప్న అమ్మ కనకంకి, స్వప్న వాళ్ళ నాన్న కృష్ణమూర్తికి సంభాషణ జరుగుతుంటుంది. కృష్ణమూర్తిని మంచిగా రెడీ అయ్యి‌ రా వెళ్దామని కనకం అడగుతుంది. దానికి కృష్ణమూర్తి రానని చెప్తాడు. ఎందుకు రావని కనకం అడిగితే.. నేను బొమ్మలకి రంగులు వేస్తాను కానీ నా మనసుకి కాదని అంటాడు. దానికి కనకం నిన్ను అబద్ధాలు చెప్పమనడం లేదు నిజాలు దాస్తే చాలని కనకం అనేసరికి.. నీలాగా గాల్లో మేడలు నేను కట్టలేను.. ఇన్ని సంవత్సరాలు నీతి, నిజాయితీగా ఒక్క తప్పు కూడా చేయకుండా బ్రతికాను.. ఇప్పుడు అలాగే బ్రతుకుతానని చెప్తాడు. సరే నువ్వేం నటించనవసరం లేదు.. నా కూతురిని ఎలా గొప్పింటికి కోడలిని చేయాలో నాకు తెలుసు అని కనకం అంటుంది.

మొదటిరోజే అదరగొట్టావ్ అని రాజ్ ని సీతారామయ్య మెచ్చుకుంటాడు. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఆ తర్వాత రాజ్ గురించి రుద్రాణి సీతారామయ్యతో మాట్లాడుతుంది. నాన్న రాజ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. తను ఎవరో కాదు మొన్న పూజలో నాట్యం చేసింది కదా ఆ అమ్మయి అని సీతారామయ్యతో రుద్రాణి చెప్తుంది. పక్కనే ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ.. "ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం మనలాగే ఉంటే మనం కూడా సంబంధం కలుపుకుందాం" అని అంటుంది. దీంతో రుద్రాణి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది. "ఇలా చేసే నాకు డబ్బున్న వాడిని ఇచ్చి చేసారు. ఇప్పుడు చూస్తే వాడు వదిలేసి పోయాడు. రాజ్ నువ్వు ఎవరేం చెప్పినా వినకు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో" అని రుద్రాణి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కావ్య వాళ్ళింట్లో డబ్బులు ఈ నెల ఎక్కువగా వచ్చాయని వాళ్ళ నాన్న కృష్ణమూర్తితో చెప్తుంటుంది. కాసేపటికి రాజ్ నుండి స్వప్నకి కాల్ వస్తుంది. తను మేకప్ వేసుకుంటానని చెప్పి కావ్యని కాల్ లిఫ్ట్ చేయమంటుంది. కావ్య హలో అనగానే అవతలివైపు ఎవరా అని రాజ్ మౌనంగా ఉంటాడు.  ఇంతలో రాజ్ తమ్ముడు రాహుల్ ఫోన్ లాక్కొని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడతాడు. రేపు మీకు‌‌ రాజ్ అన్నయ్యకి కలిపి డేటింగ్ చేస్తున్నాను.. బిల్ మీరే కట్టాలి అనగా స్వప్న సరే అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గర మనీ అడిగి తీసుకుంటుంది. మరోవైపు కనకం రాజ్ ఇంటికి వెళ్ళడానికి అంతా రెడీ అవుతూ, స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొని హాడావిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.