English | Telugu

Podharillu Serial : పెళ్ళి చేసుకొని ఇంటికి వస్తున్న చక్రి, మహా.. కేశవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-30 లో.. చక్రి, మహా పెళ్ళి చేసుకొని వెళ్తారు. మరోవైపు చక్రి వాళ్ళ అన్న కేశవ.. తమ్ముడు కన్నా అందరు హ్యాపీగా ఉంటారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ నుండి కేశవకి కాల్ వస్తుంది. చక్రి మీకు ఏమవుతాడు. మీరు ఎంతమంది ఉంటారని వివరాలు అడుగుతాడు కానిస్టేబుల్. ఇక కేశవ టెన్షన్ పడతాడు.

మా చక్రికి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. ఏం కాలేదు.. మీ తమ్ముడు చేసుకున్న అమ్మాయి వాళ్ళు గొప్పింటి వాళ్ళు.. చాలా మంది రౌడీలు ఉన్నారు. మీ ఇంటికి ఆ అమ్మాయి వస్తుంది. తనకేం లోటు లేకుండా చూస్కోవాలని ఎస్సై చెప్తాడు. దాంతో కేశవ సరేనంటాడు. మరోవైపు చక్రి, మహా ఇద్దరు హైవేలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగుతారు. తనకోసం ఒక టీ చెప్పమంటుంది మహా. రెండు ప్లేట్లు గారెలు ఆర్డర్ ఇస్తాడు చక్రి. ఆ తర్వాత మహా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. నాకు సిటీలో ఒక హాస్టల్ లో రూమ్ కావాలని మహా అడుగుతుంది. నేను బెంగుళూరుకి వెళ్తున్నానని ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ అని అతను చెప్పగానే మహా ఏం చేయలేకపోతుంది. ఇక చక్రి వస్తాడు.

నాకు ఒక రూమ్ కావాలని మహా అనగానే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మా ఇంటికి వస్తారు. మన పెళ్ళి జరిగిందని మా అన్నయ్యకి పోలీసులు కాల్ చేశారంట అని చెప్పగానే మహా చేసేదేమీ లేక ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయల్దేరి వెళ్తారు. మరోవైపు చక్రి, మహా ఇంటికి వస్తున్నారని కేశవ, కన్నా వాళ్ళు ఇంటిని శుభ్రం చేసి లైట్లు వేసి గ్రాంఢ్ గా ఏర్పాట్లు చేస్తారు. ఇక రాత్రి బాగా తాగేసి కేశవ, చక్రి వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ ఇల్లు చూసి ఇది మాది కాదేమోనని వెళుతుంటే వాళ్ళు చూసి ఇది మన ఇల్లు అని అంటారు. ఇక చక్రి, మహా పెళ్ళి చేసుకొని వస్తున్నారని వాళ్ళ నాన్నకి కేశవ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.