English | Telugu

Karthika Deepam2: గతం మర్చిపోయిన సుమిత్ర.. దీప త్యాగం చేయనుందా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 589 లో.. దీప, కార్తీక్ ఇద్దరు స్కూటీ మీద శివన్నారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే సుమిత్ర బయటకు నడుచుకుంటూ వస్తుంటుంది. ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని అడుగుతుంది దీప. ఎవరు నువ్వు అమ్మ అని పిలుస్తున్నావని సుమిత్ర అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. అదేంటి అత్త.. తను దీప, నా భార్య అని కార్తీక్ అనగానే నువ్వు ఎవరు నన్ను అత్త అని పిలుస్తున్నావని అనగానే ఇద్దరు షాక్ అవుతారు.

ఇక అప్పుడే దశరథ్ వస్తాడు. అదేంటి మామ.. ఎవరిని గుర్తుపెట్టడం లేదని కార్తీక్ అడుగుతాడు. నేను తర్వాత చెప్తానని సుమిత్రని తీసుకొని దశరథ్ లోపలికి వెళ్తాడు. ఇక దీప, కార్తీక్ లోపలికి వెళ్తారు. ఇదేం కర్మరా దేవుడా అని శివన్నారాయణ , పారిజాతం అనుకుంటారు. ఏమైందని దశరథ్ ని కార్తీక్ అడుగుతాడు. డాక్టర్‌ కి కాల్ చేశాను.. తనకు ఉన్న జబ్బులో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అంట అని దశరథ్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. మరి ఏం చేద్దామని కార్తీక్ అనగానే ఇంత ఐశ్వర్యం ఉండి నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పుకుంటూ దశరథ్ ఏడుస్తుంటాడు. మీరు ఏడ్వకండి మామ.. నాకు ఏడుపు వస్తుంది అని కార్తీక్ అనగానే ఏం చేయాలిరా అని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. అత్తకి ఏం కాదు మామయ్య అని కార్తీక్ అనగానే నాకు మాటివ్వురా అని దశరథ్ అనగానే ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందామని దశరథ్ ని తీసుకొని కార్తీక్ బయటకు వస్తాడు.

కాసేపటికి దశరథ్ ని కన్విన్స్ చేసి కార్తీక్ లోపలికి వస్తాడు. అప్పటికే దీప కనపడదు. ఇల్లంతా వెతుకుతాడు కార్తీక్ కానీ దీప ఎక్కడా కనపడకపోయేసరికి టెన్షన్ పడతాడు. ఇక డాక్టర్ దగ్గరికి దీప వెళ్ళి.. తన తల్లి సుమిత్రని కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. మరి నీ కడుపులోని బిడ్డ ఎలా అని డాక్టర్ అంటుంది. నాకు నా తల్లి ప్రాణాలు కావాలని దీప అనగానే మీ భర్త వచ్చి నా కూతురు ఎక్కడ.. ఏం రైట్స్ ఉన్నాయని అలా ఎందుకు చేశారని నన్ను మీ భర్త అంటే నేనేం చేయాలని డాక్టర్ అనగానే దీప ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.