English | Telugu

బెటర్ పొజిషన్ లో ఉన్న హీరోస్ దగ్గరకు స్క్రిప్ట్స్ వెళ్లిపోతున్నాయి...


ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ కామెంటరీ చెప్తాడు అలాగే హోస్టింగ్ కూడా చేస్తాడు. అలాంటి నంది కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఎం ఇచ్చాడో చూద్దాం.." పెళ్ళాం చెప్తే వినకపోతే ఎలాంటి సందర్భాలు ఉంటాయో నాకు తెలుసు పర్సనల్ గా అడగండి చెప్తాను" అన్నాడు. "ఇక లవ్ ప్రొపోజల్ ఎవరు ముందుగా చేశారు అనేదానికంటే నేనే గీతాతో ఐ లవ్ యు అని చెప్పించాను. ఢీ జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ స్పాంటేనియస్ జోక్స్ వేస్తారు. హన్సిక చాలా తొందరగా కలిసిపోతారు. గణేష్ మాష్టర్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కి కొరియోగ్రఫీ చేసాను అన్న అహం ఉండకుండా అందరికీ హెల్ప్ చేస్తుంటారు. విజయ్ బిన్నీ మాష్టర్ క్లారిటీగా జడ్జ్మెంట్ ఇస్తారు. 2014 ఫిబ్రవరి 9 న పెళ్లయ్యింది.

ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చినందుకు ఏడుకొండల స్వామికి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఐపిఎల్ కామెంటరీ, హోస్టింగ్ అనేవి రెండూ కష్టమే. రెండిట్లో స్పాంటేనిటీ అవసరం. బుల్లితెర మీద మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఆది. నేను ఇష్టపడే ఫుడ్ ఇంట్లో చేసే ముద్దపప్పు ఆవకాయ, పొటాటో ఫ్రై, టమాటో ఆనియన్ కూర ఇష్టం, బెండకాయ కూర ఇష్టం. కొరివి కారం, టమాటో పచ్చడి చాలా ఇష్టం. నా లైఫ్ లో నా ఫామిలీ, గీత మోస్ట్ సపోర్టివ్ పర్సన్స్. నేను అనుకున్న స్క్రిప్ట్స్ నేను చేయలేకపోయాను..జనాలకు నచ్చే స్క్రిప్ట్స్ నా వరకు రావట్లేదు. కొంచెం అదృష్టం కూడా ఇక్కడ ఉండాలి. బెటర్ పొజిషన్ లో ఉన్న హీరోస్ దగ్గరకు స్క్రిప్ట్స్ వెళ్లిపోవడం జరుగుతోంది. దాంతో ఆడియన్స్ కి నేను దగ్గర కాలేకపోతున్న అన్న ఫీలింగ్ వచ్చి సినిమాలు చేయడం మానేశా. ఆడియన్స్ కి దగ్గరవ్వాలంటే క్రికెట్ కామెంటరీ, ఢీ స్టేజి అనిపించి ఇటు వైపుకు వచ్చేసా. ఐతే సినిమాల ద్వారా ఇంకాకా దగ్గరవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పాడు నందు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.