English | Telugu
కావ్యశ్రీ దగ్గరికి నిఖిల్.. హైప్ ఎక్కిస్తున్న ప్రోమో!
Updated : Mar 10, 2025
బిగ్ బాస్ సీజన్-8 విజేతగా నిలిచిన నిఖిల్ గురించి అందరికి తెలిసిందే. అతని మాజీ ప్రేయసి కావ్యశ్రీతో బ్రేకప్ అయ్యింది. నిఖిల్ కావ్యలు కలవాలని, వాళ్లిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ని చెరిపేసుకుని కావ్య నిఖిల్ గా ఉండాలని చాలామంది సీరియల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ తరువాత ఏం ప్రాజెక్ట్ చేస్తారని అందరిలోనూ ఆసక్తి ఉండేది. అయితే నిఖిల్ రీ ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు.
కావ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ‘చిన్ని’ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. జైలులో ఖైదీగా ఉన్న కావేరి (కావ్య) చనిపోయిందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్‌కి మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే సీరియల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘గేమ్ స్టార్ట్ నౌ’ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. 50 సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో అయితే అదిరిపోయింది. ఇక ప్రోమోకి నిఖిల్, కావ్య ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం ట్విస్ట్‌రా బాబూ.. ఇన్నాళ్లూ మీరిద్దరూ కలవాలని కోరుకున్నాం.. కానీ ఇద్దరూ కలిసి పెద్ద ట్విస్టే ఇచ్చారంటూ అటు నిఖిల్ ఫ్యాన్స్, ఇటు కావ్య ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.
తాజా ప్రోమోలో జస్ట్ అతను జీపుపై రావడం.. బాస్కెట్ బాల్ కోర్టులో ఉన్న కావ్యని కలిసి.. ఆమెకి బాల్ ఇచ్చి ఆమెతో చేతులు కలపడం చూపించారు. ఇద్దరూ చేతులు కలిపినప్పుడు ‘గేమ్ స్టార్ట్ నౌ’ అని టైటిల్ వేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఇద్దరి మధ్య రియల్ లైఫ్‌లో ఎలాంటి వైరం ఉందో పక్కన పెడితే.. ‘చిన్ని’ సీరియల్‌లో మాత్రం టఫ్ వార్ ఉండబోతుందని తేలిపోయింది. ఆ ప్రోమోని బట్టి చూస్తే.. నిఖిల్ పోలీస్ ఆఫీస్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తుంది. క్షుణ్ణంగా చూస్తే.. నిఖిల్ పక్కన జబర్దస్త్ పవిత్ర వైట్ అండ్ బ్లూ డ్రెస్‌లో అతనికి అసిస్టెంట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.