English | Telugu
Suman Shetty Remuneration: సుమన్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Updated : Dec 14, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో శనివారం నాటి ఎపిసోడ్ ఆకట్టుకునేలా సాగింది. 14వ వారం ఎవరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ దత్తపుత్రుడు సుమన్ శెట్టి అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా అతనే ఎలిమినేషన్ అయ్యాడు. టాప్-7 కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిన్న హౌస్ నుండి బయటకొచ్చాడు. (Suman Shetty Remuneration)
సుమన్ శెట్టికి రోజుకు 45 వేల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి మూడు లక్షల పదిహేను వేల వరకు సుమన్ శెట్టి రెమ్యునరేషన్ అందుకున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిలిచాడు. బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ కి యాభై లక్షలు ఇస్తారు. టాక్స్ లు కట్ అయితే ఆయనకు దక్కేది నలభై లక్షలు ఉండొచ్చు. అలాంటిది సుమన్ శెట్టికి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందింది. పైగా మధ్యలో ఎవరికైనా సూట్ కేసు ఆఫర్‌కి టెంప్ట్ అయితే విన్నర్‌కి ఆ మాత్రం కూడా రాదు. చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్ శెట్టికి ఇప్పుడు విన్నర్‌కి మించిన పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇందులోనూ కొంత టాక్స్ కట్ అవుతుందని చెప్పొచ్చు.
సుమన్ శెట్టి హౌస్ లో పద్నాలుగు వారాలు ఉన్నాడు. ఇందులో టాస్క్ లో రెండు, మూడు సార్లు గెలిచాడు అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతగా ఏం లేదు. కానీ అతడికి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అతడు ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నాడు.