English | Telugu

Akhil Sarthak sweet warning to Demon Pavan: డీమాన్ పవన్‌కి అఖిల్ సార్థక్ స్వీట్ వార్నింగ్


బిగ్‌బాస్ సీజన్-9 లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ప్రతి హౌస్‌మేట్‌కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్ స్టేజ్ మీదకి వస్తున్నారు. నిన్నటి ఆదివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి పిల్లలు, కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఇక రీతూ చౌదరి కోసం ఆమె బ్రదర్, ఫ్రెండ్ అఖిల్ సార్థక్ స్టేజ్ మీదకి వచ్చారు.

రీతూ బ్రదర్ జతిన్, ఫ్రెండ్ అఖిల్‌ సార్థక్ ని చూడగానే రీతూ తెగ గెంతులేసింది. హాయ్ అఖిల్.. అంటూ రీతూ గట్టిగా నవ్వుతుంటే నవ్వకు అంటూ అఖిల్ పంచ్ వేశాడు. సర్ మీరు తన నవ్వును కాపీ కొట్టారనుకోండి.. బయటికెళ్లిన తర్వాత మీరు కూడా అలానే నవ్వుతారంటూ నాగార్జునతో సరదాగా అన్నాడు అఖిల్ సార్థక్. ఇంతలో జతిన్.. అతను డీమాన్.. అంటూ రీతూ బ్రదర్‌కి నాగార్జున పరిచయం చేశారు. హా తెలుసు సర్ అని జతిన్ అంటుంటే ఆయనకి తెలీకుండా ఉంటుందా.. అని అఖిల్ పంచ్ వేశాడు. హాయ్ జతిన్.. అని డీమాన్ చెప్తుంటే నువ్వు బయటికొచ్చాక జాగ్రత్తగా ఉండాలి డీమాన్ అంటూ అఖిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత బాక్స్‌లో నుంచి ఒక క్యారెక్టర్ ఫొటో తీశాడు అఖిల్. అది కాస్తా పుష్ప ఫొటో కావడంతో ఏయ్.. పుష్ప.. రీతూయే సార్ అసలు తగ్గనే తగ్గదంటూ అఖిల్ అన్నాడు.

బయట చాలా నెగెటివ్ ఉండేది కానీ హౌస్ లోకి వచ్చి మొత్తం పాజిటివ్ అయిపోయావ్.. గేమ్స్ బాగా ఆడుతున్నావ్.. ఆ నవ్వుకి ఫ్యాన్స్ ఉన్నారంటూ రీతూతో అఖిల్ సార్థక్ అన్నాడు‌. ఏం అయినా మార్చుకోవాలా అని రీతూ అడుగగా.. ఏమీ లేదు.. నీ ఆట నువ్వు ఆడు.. ఇండివిడ్యువల్ గా ఆడు.. గేమ్స్ ఇంకా బాగా ఆడు అంటు అఖిల్ సార్థక్ చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి బాగా ఆడుతున్నారని చెప్పాడు అఖిల్ సార్థక్.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.