English | Telugu
రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసారా, చెయ్యలేదా..సినిమా పోలీసులు అనుకుంటున్నాడా ఏంటి!
Updated : Nov 25, 2024
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపిలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీంతో మద్దిపాడు పోలీసులు వర్మ ని కలిసి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.ఈ విషయంపై వర్మ కోర్టుకి వెళ్లినా కూడా విచారణ తప్పదని, కోర్టు తీర్పుని ఇచ్చింది. కానీ వర్మ విచారణకి హాజరు కాకుండా మరికొంత సమయం కావాలని పోలీసులకి వాట్సప్ ద్వారా మెసేజ్ చేసాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ పోలీసులు వర్మ కి మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా విచారణకి హాజరు కాలేనని వర్మ పోలీసులకి చెప్పడంతో వర్మ ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి కూడా చేరుకున్నారు.