Read more!

English | Telugu

క్రికెటర్ ని పెళ్ళి చేసుకోవద్దని చెప్పిన నేహా చౌదరి!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు. 

నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. మొదట ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా చేసిన నేహా చౌదరి.. మల్టీ ట్యాలెంటెడ్ అనే చెప్పాలి. న్యూస్ రీడర్ గా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత ఒక సీరియల్ లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా నేహా అథ్లెటిక్, యోగా ట్రైనర్ ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఐపీల్ మ్యాచ్ కి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రెప్రెజెంటర్ గా చేసింది.

విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది.

ఇటీవల నేహా తన భర్తతో కలిసి జర్మనీకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. తన పేరెంట్స్ ని వదిలివెళ్తు ఎమోషనల్ అయిన ఒక వీడియోని పోస్ట్ చేసింది నేహా. అది అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా నేహా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నాను తీసుకోండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

 క్రికెటర్ లని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎప్పుడు మ్యాచ్ మ్యాచ్ అంటూ తిరుగుతుంటారు. సండే వస్తే క్రికెట్ మ్యాచ్.. హాలిడే వస్తే క్రికెట్ మ్యాచ్ అంతే తప్ప భార్యని బయటకు తీసుకెళ్దామని ఏం ఉండదు. నాలాగా సర్దుకుపోయే వైఫ్ ఏం చేస్తారంటే అయన ఆలా ఆడుతూ ఉంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ తింటూ చూస్తారని చెప్పింది నేహా. అలా నేహా చౌదరి భర్త క్రికెట్ ఆడుతున్న వీడియోని చూపిస్తూ.. తనలోని ఫ్రస్ట్రేషన్ ని బయటకు చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.