English | Telugu

వైష్ణో దేవిని ద‌ర్శించుకున్న ఆదిపురుష్ డైర‌క్ట‌ర్‌

ప్యాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ప్ర‌భాస్‌. మ‌ర్యాద‌పురుషోత్త‌ముడు శ్రీరాముడి క‌థ‌లో రాఘ‌వుడిగా న‌టిస్తున్నారు ప్రభాస్‌. ఆయ‌న స‌ర‌స‌న జాన‌కీమాత‌గా న‌టిస్తున్నారు కృతిస‌న‌న్‌. లంకేశ్వ‌రుడిగా మెప్పించ‌నున్నారు సైఫ్ అలీఖాన్. ఈ సినిమాను ఓమ్ ర‌వుత్ తెర‌కెక్కిస్తున్నారు. టీసీరీస్ భూష‌ణ్ కుమార్ నిర్మాత‌ల్లో ఒక‌రు. ఈ సినిమాను ఈ వేస‌వి దాటాక విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఓం ర‌వుత్‌, నిర్మాత భూషణ్ కుమార్ క‌లిసి వైష్ణో దేవి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ న‌వ‌రాత్రులు జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రూ వెళ్లి మాత‌ను సంద‌ర్శించుకున్నారు. త్వ‌ర‌లోనే చిత్రం ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లుపెట్టాల‌న్న‌ది కోరిక‌. జ‌మ్ము కాశ్మీర్‌లోని వైష్ణో దేవి కోవెల అంటే ఓం ర‌వుత్‌కి చాలా సెంటిమెంట్ అట‌...