English | Telugu

కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్..పోలీస్ స్టేషన్ కి అసలు ఎందుకు వెళ్ళింది ?

జయమ్ము నిశ్చయమ్ము రా సెలబ్రిటీ టాక్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. ఇక ఈ వారం షోకి మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక ఆమె నవ్వు ఆమె లైఫ్ గురించి మొత్తం ఈ షోలో చెప్పుకొచ్చింది. ఐతే ఈమె పోలీసు స్టేషన్ కి వెళ్ళింది ఒకసారి. దాంతో జగపతి బాబు ఈ పోలీసు స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడిగేసరికి..అసలు విషయం బయటపెట్టింది. "కాలేజీ టైములో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఒక సలోన్ కి మేము వెళ్తున్న టైములో ఒక చోట నిలబడి ఎం చేయాలి అని చూస్తున్న టైములో ఒక అబ్బాయి వచ్చి మేము రోడ్ క్రాస్ చేసే టైములో భుజాన్ని టచ్ చేసాడు. దాంతో నేను వాడిని పట్టుకుని వెంటనే లాగే ఒక్కటి ఇచ్చాను.

సుదీప్ మూవీ లో సాంగ్ పాడుతున్న...ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్

​తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో దర్శన్ అనే కంటెస్టెంట్ స్పెషల్ గా తన టాలెంట్ ఆఫ్ సింగింగ్ తో అలాగే చక్కగా తెలుగు నేర్చుకుని జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో దర్శన్ ఒక అద్భుతమైన సాంగ్ పాడి జడ్జెస్ అందరినీ మెప్పించాడు. "నేను నా నెక్స్ట్ ఫిలింని సుదీప్ తో అలాగే సంతోష్ ఆనంద్ రామ్ తో కలిసి పని చేస్తున్నాను. ఆ మూవీలో నువ్వు ఒక సాంగ్ పాడాలి. అలాగే నువ్వు పాడే పాత రికార్డింగ్ సెషన్ కి విజయ్ ప్రకాష్ ని కూడా పిలుస్తాను" అంటూ థమన్ ఒక బిగ్ ఆఫర్ ని దర్శన్ కి ఇచ్చేసరికి అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

బాలు గారిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం  

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కి ఫాన్స్ అంతా ముద్దుగా పిలుచుకునే కిల్ బిల్ పాండే అలియాస్ బ్రహ్మానందం షోకి గెస్ట్ రా వచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆయన స్టేజి మీదకు రాగానే హోస్ట్ శ్రీరామా చంద్ర వెళ్లి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక జడ్జెస్ కూడా లేచి నిలబడ్డారు. "మీరు వచ్చినందుకు చాల చాలా ఆనందంగా ఉంది సర్. అల్లాడిపోతున్నాను సర్" అంటూ హోస్ట్ సమీరా భరద్వాజ్ అనేసరికి బ్రహ్మానందం షాక్ అయ్యారు. "మీ స్టైల్ లో కంటెస్టెంట్స్ కి ఒక ఆల్ ది బెస్ట్" చెప్పండి అనేసరికి ఫన్నీగా చెప్పి అందరినీ నవ్వించారు ఆయన.