ఎన్నో అవరోధాల తర్వాత ‘పాతాళభైరవి’తో చరిత్ర సృష్టించి 300 సినిమాల్లో నటించిన ఎస్వీ రంగారావు!
సినిమాల్లో నటించాలని, గొప్ప పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది ఆశపడతారు, కలలు కంటారు. అయితే అందరి ఆశలు నెరవేరవు, కలలు నిజం కావు. ఒకప్పుడు అందరూ నాటక రంగం నుంచి వచ్చినవారే.