టీకాంగ్రెస్ లో జగ్గారెడ్డి కలకలం... గాంధీభవన్ లో గుసగుసలు....
తూర్పు జయప్రకాష్ రెడ్డి... అలియాస్ జగ్గారెడ్డి... సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే... కేసీఆర్ ప్రభంజనంలో సైతం విజయఢంకా మోగించిన మాస్ లీడర్. ఇక, జగ్గారెడ్డి ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే... పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారినా... రాజకీయాలకు అతీతంగా ప్రజా మద్దతును సంపాదించుకున్నారు. అందుకే, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నంతగా క్రేజు సంపాదించుకున్నారు.