ఆ విషయంలో తగ్గేదేలే.. దటీజ్ రుక్మిణి వసంత్
సప్త సాగరాలు ధాటి సైడ్ ఏ, సైడ్ బి చిత్రాల్లో 'ప్రియ' అనే క్యారక్టర్ లో అద్బుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న కన్నడ హీరోయిన్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth). ఆ తర్వాత బఘిర, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏసిఈ వంటి చిత్రాల్లో నటించింది. ఆ మూడు చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే రుక్మిణి పెర్ఫార్మెన్సు కి మంచి పేరు రావడంతో, పలు భాషల్లో వరుస ఆఫర్స్ రుక్మిణి కి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న'మద్రాసి'(Madrasi)అనే చిత్రంలో చేస్తుంది.