English | Telugu

రెండు కాలాల్లోను బాలయ్య టాప్! 

'గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ'(Balakrishna)వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ  కోవలోనే మరో బ్లాక్ బస్టర్ ని అందుకునేందుకు 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)దర్శకత్వంలో 'అఖండ పార్ట్  2'(Akhanda 2)ని సిద్ధం చేస్తున్నాడు. డెవోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అఖండ కి సీక్వెల్ కావడంతో, ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయదశమి(Vijayadasami)కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Tejaswini),14 రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ  త్వరలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకోనుంది.

వరల్డ్ రికార్డు సృష్టించిన దీపికా పదుకునే.. పాండ్యా, రొనాల్డో రికార్డు బద్దలు 

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'దీపికా పదుకునే'(Deepika padukone). బాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న 'దీపికా' గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి' తో తన సత్తా చాటింది.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో చేస్తుంది. దీపికా క్యారక్టర్ కి సంబంధించి, మేకర్స్ రిలీజ్ చేసిన  వీడియోతో, దీపికా ఒక శక్తీ వంతమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అర్ధమవుతుంది.

సోహెల్ తో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక.. రంగంలోకి హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్

చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలోఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన హన్సిక(Hansika Motwani)2007లో 'ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్'(Allu Arjun),దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh)ల కాంబినేషన్ లో వచ్చిన 'దేశముదురు' ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటమ్ చేసింది. మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ ఫిమేల్ కేటగిరిలో ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత  కంత్రి, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పవర్ వంటి పలు చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సొంతం చేసుకుంది. తమిళ, కన్నడ భాషల్లోను పలు చిత్రాల్లో నటిస్తు తన సత్తా చాటుతు వస్తుంది.