English | Telugu
రామాయణం పై కీలక వ్యాఖ్యలు చేసిన యష్
Updated : Oct 22, 2024
కేజీఎఫ్(kgf)సిరీస్ తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో యష్(yash)కేజీఎఫ్ 2 తర్వాత అభిమానుల అంచనాలకు మించకండా సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చాలా గ్యాప్ తీసుకొని ప్రెజంట్ 'టాక్సిక్ 'అనే మూవీ చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ మూవీకి మలయాళ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్(geethu mohan das)దర్శకత్వం వహిస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా తెరకెక్కుతున్న'రామాయణ' లో కూడా యష్ రావణాసురుడుగా చేస్తున్నాడు.
లేటెస్ట్ గా యష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ డినెగ్ సంస్థలో టాక్సిక్ కి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్న సమయంలో లాస్ ఏంజిల్స్ వెళ్ళాను.ఆ సమయంలో ఆ సంస్థ సీఈఓ నవీన్ మల్హోత్రా 'రామాయణ' టాపిక్ ని తీసుకొచ్చారు.ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కూడా పలు కారణాల వల్ల సాధ్యపడటం లేదని, భారతీయ చిత్రాలని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేదే తన లక్ష్యమని చెప్పాడు.దాంతో ఆయన విజన్ నన్ను ఎంతగానో ఆకర్షించి రామాయణ కు సహా నిర్మాతగా ఉండాలనుకున్నాను.
అప్పటికే రాముడుగా రణబీర్ కపూర్(ranbir kapoor)ని ఫైనల్ చేసారు.ఉత్తరాదితో పాటు దక్షణాది వాళ్ళని కూడా తీసుకోవాలనుకున్నాం.సాయి పల్లవి(sai pallavi)ని దర్శకుడు నితీష్ తివారి నే సెలక్ట్ చేసాడు.ఒక వేళ నన్ను ఇందులో వేరే ఏదైనా క్యారక్టర్ చెయ్యమంటే చేసుండే వాడిని కాదేమో. ఒక నటుడుగా పలు రకాల షేడ్స్ ఉన్న రావణుడి రోల్ ప్లే చెయ్యడమే నాకు ఇష్టం.ప్రేక్షకులకి ప్రామిస్ చేసినట్టే కేజీఎఫ్ పార్ట్ 3 కూడా ఖచ్చితంగా ఉంటుంది.సలార్ కి పార్ట్ 3 కి సంబంధమే ఉండదని చెప్పుకొచ్చాడు.