Read more!

English | Telugu

వాట్ ది ఫిష్.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది!

మంచు మనోజ్ చివరిసారిగా 2017 లో విడుదలైన 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమానే రాలేదు. మధ్యలో 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాని ప్రకటించగా, అది పట్టాలెక్కలేదు. అయితే దాదాపు ఆరేళ్ళు తర్వాత 'వాట్ ది ఫిష్' అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 

మనోజ్ హీరోగా నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వాట్ ది ఫిష్'. సిక్స్ సినిమాస్ బ్యానర్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. నేడు(మే 20) మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని విడుదల చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి తన సినిమాల్లో వైవిధ్యం చూపించడానికి ఇష్టపడే మనోజ్.. మరో విభిన్న చిత్రంతో రాబోతున్నాడని ఫస్ట్ లుక్ ని చూస్తే అర్థమవుతోంది. ఇందులో ఆయన విభిన్న కోణాలున్న పాత్ర పోషిస్తున్నాడని, ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అనిపిస్తోంది. కళ్ళజోడు పెట్టుకొని గ్రే షేడ్ లో ఒక రూపం, దాని వెనుక మరో ఉన్నట్టుగా రూపొందించిన 'వాట్ ది ఫిష్' ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. మరి ఈ కమ్ బ్యాక్ మూవీతో మనోజ్ ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.