English | Telugu
చక్రి మరణం ముందురోజు ఏం జరిగింది?
Updated : Dec 20, 2014
చక్రి మరణం పరిశ్రమని, అతని స్నేహితుల్ని షాక్‌కి గురిచేసింది. అంత వరకూ కళ్ల ముందు కనిపించిన మనిషిని నిర్జీవంగా చూసేసరికి తట్టుకోలేకపోయారు. అయితే చక్రి మరణించిన ముందు రోజు ఏం జరిగింది?? తను ఎక్కడున్నాడు?? ఈ విషయాలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. వీటిపై చక్రి భార్య శ్రావణి సమాధానమిచ్చింది. చక్రి ముందు రోజు రాత్రి ఏడింటి వరకూ ఇంట్లోనే ఉన్నాడట. ఆ తరవాత రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లిపోయాడు. ఎప్పుడో అర్థరాత్రి వచ్చి రెండింటి వరకూ టీవీ చూసి.. పడుకొన్నాడు. తెల్లవారుఝామున మాత్ర వేసుకోవడం శ్రావణికి అలవాటు. మాత్ర వేసుకోవడానికి యధావిధిగా లేచింది. అయితే.. ఏమాత్రం చలనం లేకుండా పడుకొని ఉన్నచక్రినిచూస్తే అనుమానం వేసిందామెకు. ఎందుకంటే చక్రి కి గురకపెట్టే అలవాటు ఉంది. కానీ ఆ శబ్దం కూడా వినిపించడం లేదు. పరీక్షగా చూస్తే అప్పటికే శరీరం రంగు మారిపోయిందట. శ్వాస కూడా తీసుకోవడంలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే.. అప్పటికే చక్రి మరణించాడని డాక్టర్లు ధృవీకరించేశారు. అలా చక్రి ప్రాణం తన సొంత ఇంట్లోనే పోయిందన్నమాట. ఈ విషయాలన్నీ శ్రావణి వెల్లడించింది.