English | Telugu

విష్ణు - దేవాక‌ట్టా క‌ల‌యిక‌లో

ప్ర‌స్తుతం ఎర్ర‌బ‌స్సు ఎక్కి.... ర‌య్ ర‌య్ మంటూ దూసుకుపోతున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా త‌ర‌వాత మ‌రో సినిమా వెంట‌నే ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నాడు. వెన్నెల‌, ప్ర‌స్థానం చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టాతో విష్ణు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతోంది. స్ర్కిప్ట్ ప‌నులు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం క‌థానాయిక‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. న‌వంబ‌రు 14న ఎర్ర‌బ‌స్సు విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాతే... దేవాక‌ట్టా సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఆటోన‌గ‌ర్ సూర్య త‌ర‌వాత దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిదే.