English | Telugu

రవిబాబు శిష్యుడికి ఛాన్స్ ఇచ్చిన విష్ణు

ప్ర‌స్తుతం దేవా కట్ట దర్శకత్వంలో ‘డైనమైట్‌’ చిత్రంలో బిజీగా ఉన్న మంచు విష్ణు, తన నెక్స్ట్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రవిబాబు వద్ద శిష్యరికం చేసిన హనుమాన్‌` ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో విష్ణు సరసన నటించేందుకు ఓ అగ్ర క‌థానాయిక‌ని ఎంపిక చేయనున్నారు. చిత్ర దర్శకుడు ముప్పరాజు హనుమాన్‌ మాట్లాడుతూ... ‘ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మంచు విష్ణు ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకె చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. నేటి సమాజంలోని ఒక తీవ్రమైన సమస్యకు ఈ చిత్రంలో సమాధానం చెప్పనున్నాం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు!

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.